ICC Rankings: ప్రపంచ నంబర్.1 బౌల‌ర్ గా జస్ప్రీత్ బుమ్రా..

By Mahesh Rajamoni  |  First Published Feb 7, 2024, 3:22 PM IST

ICC Bowling Rankings: జస్ప్రీత్ బుమ్రా త‌న కెరీర్‌లో అత్యుత్తమ టెస్ట్ రేటింగ్‌ను సాధించాడు. దీంతో మూడు ఫార్మాట్ ల‌లో నంబ‌ర్ వ‌న్ బౌల‌ర్ గా మ‌రో ఘ‌న‌త సాధించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన వైజాగ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసుకుని బుమ్రా టీమిండియా గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు.
 


ICC Rankings - Jasprit Bumrah: విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ తో సరికొత్త చ‌రిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో నంబ‌ర్.1 బౌల‌ర్ గా నిలిచాడు. దీంతో టెస్టు క్రికెట్, వ‌న్డే క్రికెట్, టీ20 క్రికెట్.. ఇలా మూడు ఫార్మాట్ ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు నెంబ‌ర్.1 బౌల‌ర్ గా నిలిచిన ప్లేయ‌ర్ గా ఘ‌నత సాధించాడు.

వైజాగ్ టెస్టులో బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 6, రెండో ఇన్నింగ్స్ 3 వికెట్ల‌తో మొత్తంగా ఈ మ్యాచ్ లో 9 వికెట్లు తీసుకుని భార‌త్ గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. ఇదివ‌ర‌కు తొలి స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానంలో వ‌చ్చాడు. బుమ్రా విశాఖ‌ప‌ట్నంలో టెస్టులో అద్భుత‌మైన బౌలింగ్ తో రెండు స్థానాలు ఎగ‌బాకి అగ్ర‌స్థానంలో చేరాడు. బుమ్రా మొత్తం 881 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (851 రేటింగ్స్) కంటే ముప్పై రేటింగ్ పాయింట్ల అధికంతో తొలి స్థానంలో నిలిచాడు. ర‌బాడ రెండో స్థానంలో ఉన్నాడు. టాప్ 10 టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో బుమ్రాతో పాటు అశ్విన్ (841 రేటింగ్స్), రవీంద్ర జడేజా (746 రేటింగ్స్) ఉన్నారు.

Latest Videos

ప‌రుగులు కోసం ఈత కొట్టాల్సిందే.. ఇది మాములు క్రేజీ క్రికెట్ కాదు ర‌చ్చ రంబోలా !

ఇక బ్యాటింగ్ పరంగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మొత్తం 864 రేటింగ్స్ సాధించిన విలియమ్సన్ టాప్-10లో ఉన్నాడు. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా ప్రధాన టెస్టు బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ ఒక స్థానం ఎగబాకి ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్  ను వెనక్కి నెట్టి కొత్త నెంబ‌ర్.2గా నిలిచాడు. అలాగే ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (765 రేటింగ్స్) ఆరో స్థానంలో, విరాట్ (760) ఏడో స్థానంలో ఉన్నారు. వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ 37 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ 29వ స్థానంలో నిలిచాడు.

ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్:

1. జస్ప్రీత్ బుమ్రా (881)
2. కగిసో రబడ (851)
3. రవిచంద్రన్ అశ్విన్ (841)
4. పాట్ కమిన్స్ (828)
5. జోష్ హేజిల్‌వుడ్ (818)
6. ప్రభాత్ జయసూర్య (783)
7. జేమ్స్ ఆండర్సన్ (780)
8. నాథన్ లియోన్ (746)
9. రవీంద్ర జడేజా (746)
10. ఆలీ రాబిన్సన్ (746)

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు భార‌త్.. 5 టీ20ల సిరీస్ షెడ్యూల్ ఇదిగో..

click me!