
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది వెస్టిండీస్. నాలుగో టీ20 మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్ జట్టు, ఆ తర్వాతి రోజే అద్భుత కమ్‌బ్యాక్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా నాలుగో టీ20 మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లతో 28 పరుగులు సమర్పించిన జాసన్ హోల్డర్, ఐదో టీ20లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి విండీస్‌కి విజయాన్ని అందించడం మరో విశేషం.
ఐదో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. బ్రెండన్ కింగ్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేయగా కేల్ మేయర్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు...
రొమరియో షెఫర్డ్ 5 బంతుల్లో ఓ సిక్సర్‌తో 6 పరుగులు చేసి నిరాశపరిచినా నికోలస్ పూరన్ 24 బంతుల్లో ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు. కెప్టెన్ కిరన్ పోలార్డ్ 25 బంతుల్లో ఓ సిక్సర్, 2 ఫోర్లతో 41 పరుగులు చేయగా రోవ్‌మన్ పావెల్ 17 బంతుల్లో ఓ ఫోర్, నాలుగు సిక్సర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు...
ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్, లివింగ్ స్టోన్ రెండేసి వికెట్లు తీశారు. 180 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, 19.5 ఓవర్లలో 162 పరుగులకి ఆలౌట్ అయ్యింది. జాసన్ రాయ్ 5 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు, టామ్ బాంటన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేశాడు.
జేమ్స్ విన్స్ 35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు. తాత్కాలిక కెప్టెన్ మొయిన్ ఆలీ 19 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ కాగా లియామ్ లివింగ్‌స్టోన్ 4 బంతుల్లో 6 పరుగులు, సామ్ బిల్లింగ్స్ 28 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు...
ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ విజయానికి 20 పరుగులు కావాల్సిన దశలో జాసన్ హోల్డర్‌కి బంతిని అందించాడు పోలార్డ్. మొదటి బంతి నో బాల్ కాగా, ఆ తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు. ఆఖరి ఓవర్ రెండో బంతికి క్రిస్ జోర్డాన్‌ను అవుట్ చేశాడు జాసన్ హోల్డర్. 10 బంతుల్లో 7 పరుగులు చేసిన జోర్డాన్, హేడెన్ వాల్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత బంతికి సామ్ బిల్లింగ్స్‌కి కూడా హేడెన్ వాల్స్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... ఆఖరి ఓవర్ నాలుగో బంతికి అదిల్ రషీద్‌ను గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన జాసన్ హోల్డర్, వెస్టిండీస్ తరుపున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... ఆఖరి ఓవర్ ఐదో బంతికి సదీక్ మహమూద్‌ని క్లీన్ బౌల్డ్ చేయడంతో 162 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కి తెరపడింది...
నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన జాసన్ హోల్డర్, డబుల్ హ్యాట్రిక్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, సిరీస్‌లో 15 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను గెలిచాడు... ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ పూర్తి చేసుకున్న వెస్టిండీస్ జట్టు, ఫిబ్రవరి 2న భారత పర్యటనకు రానుంది. భారత్‌లో మూడు రోజులు క్వారంటైన్‌లో గడిపిన తర్వాత ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది...