Earthquake: మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఆ విషయం తెలియక ఆటగాళ్లు ఏం చేశారంటే..

Published : Jan 30, 2022, 04:32 PM ISTUpdated : Jan 30, 2022, 04:37 PM IST
Earthquake: మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఆ విషయం తెలియక ఆటగాళ్లు ఏం చేశారంటే..

సారాంశం

Earthquake At Zimbabwe-Ireland Match:  మ్యాచ్ అప్పుడే మొదలైంది. ఐర్లాండ్ బౌలర్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేస్తున్నాడు. ఈ క్రమంలో భూమి ఒక్కసారిగా... 

అది ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ మైదానం.  అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా శనివారం ఐర్లాండ్-జింబాబ్వే వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్నది. మ్యాచ్ అప్పుడే మొదలైంది. కానీ ఐర్లాండ్ బౌలర్లు  అప్పటికే రెండు వికెట్లు తీసుకుని జోరు మీదున్నారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేస్తున్న  ఐర్లాండ్ బౌలర్ మాథ్యూ హంప్రేయస్ నాలుగు బంతులు  విసిరాడు. ఐదో బంతి వేసేందుకు సిద్దంగా ఉన్నాడు.  ఆ క్రమంలోనే.. 

ఆరో ఓవర్ వేస్తున్న మాథ్యూ.. ఓవర్ పూర్తి చేశాడు.  స్టేడియంలో ఉన్న ఆటగాళ్లకు అంతా సాధారణంగానే ఉంది. కానీ టీవీల ముందు మ్యాచులు చూస్తున్న క్రికెట్ వీక్షకులకు మాత్రం ఏదో తేడాగా అనిపించింది.  ఆరో ఓవర్ మధ్యలో  కనీసం 20 సెకన్ల పాటు కెమెరాలు అటూ ఇటూ షేక్ అయ్యాయి.  చూస్తున్నవారికి ఇదేంటో అర్థం కాలేదు.  

 

కానీ చివరికి  కామెంటేటర్లు చెప్పడంతో అసలు విషయం అర్థమైంది. క్వీన్స్ పార్క్ కు సమీపంలోనే 20  సెకన్ల పాటు భూమి కంపించిందని.. శనివారం మ్యాచ్ మధ్యలోనే భూకంపం సంభవించింది.  భూ ప్రకంపనలు సంభవించిన విషయం ఆటగాళ్లకు తెలియకపోవడం విశేషం. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.2గా నమోదైంది.

బౌలింగ్ వేసిన మాథ్యూతో పాటు బ్యాటర్లు, ఫీల్డర్లు అంతా సాధారణంగానే ఉన్నారు. తర్వాత తెలిసిందో  లేదో కానీ ఆ ఇరవై సెకన్ల పాటు గానీ, ఆ తర్వాత గానీ ఒక్క ఆటగాడైనా  కనీసం దాని గురించి మాట్లాడుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు. కానీ వీడియో కెమెరాలు షేక్ అవుతున్న విషయం వీక్షకులకు కామెంటేటర్లు చెప్పేదాకా అర్థం కాలేదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నది.  

ఇదిలాఉండగా.. ఈ మ్యాచులో జింబాబ్వేపై ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 48.4 ఓవర్లలో పడుతూ లేస్తూ 166 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (37) ఆ జట్టులో టాప్ స్కోరర్. అతడికి  డేవిడ్ బెన్నెట్ (35) సహకరించాడు. ఐర్లాండ్  బౌలర్ ముజామిల్ షెర్జాద్ 5 వికెట్లు  పడగొట్టాడు.  హంప్రేయస్ కు మూడు వికెట్లు దక్కాయి.  

ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో ఐర్లాండ్..  32 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఆ  జట్టు ఓపెనర్ డిక్సన్ (78 నాటౌట్), కెప్టెన్ టిమ్ టెక్టర్ (76 నాటౌట్) రాణించారు. 

సంక్షిప్త స్కోర్లు : జింబాబ్వే  49.4 ఓవర్లలో 166 ఆలౌట్ 
ఐర్లాండ్ : 32 ఓవర్లలో 169/2

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?