ఇండియాకి రండి చూపిస్తా... కివీస్ క్రికెటర్లను బెదిరించిన కోహ్లీ

By Sree s  |  First Published Mar 3, 2020, 6:18 PM IST

ఇక ఈ సిరీస్ లో కోహ్లీ సేన ప్రదర్శన మరీ విడ్డూరంగా ఉండడం, కోహ్లీ కూడా పేలవ ప్రదర్శనను చేయడం వల్ల ఆయన కోపం కట్టలు తెంచుకుంది. స్లిప్స్ లో క్యాచ్ అందుకున్న కోహ్లీ, ఇండియన్ ఎక్ష్ప్రెస్ కథనం ప్రకారం న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తాం అని అన్నాడు. 


న్యూజిలాండ్ పర్యటనలో భారత టెస్టు జట్టు అన్ని రంగాల్లో తేలిపోయింది. రెండు టెస్టుల్లోనూ టాస్‌ కలిసి రాలేదు. రెండు మ్యాచుల్లోనూ కఠిన పరిస్థితుల్లో తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. బలమైన గాలుల ప్రభావంతో కూడిన కివీస్‌ పిచ్‌ పరిస్థితులపై మెరుగైన అవగాహన లేకపోవడం 

ఓటమి తీవ్రతను తగ్గించడానికి, పరాజయం ఎత్తిచూపిన లోపాలను కప్పిపుచ్చేందుకు ఈ కారణాలు చక్కగా సరిపోతాయి. కానీ భారత జట్టులోని అంతర్గత లోపాలు మాత్రం అలానే ఉన్నాయి. 

Latest Videos

undefined

అన్ని కారణాలు వెరసి న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌కు మరో పరిపూర్ణ పరాజయం మాత్రం మిగిలింది. వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన భారత్‌, టెస్టు సిరీస్‌ను 0-2తో పువ్వుల్లో పెట్టి ఇచ్చేసింది. 

క్రైస్ట్‌చర్చ్‌ టెస్టులో కోహ్లిసేన కొంతమేరకు పోరాడినా, అది పోటీలో ఉన్నామని చెప్పేందుకు సరిపోయింది. ఓటమిని అడ్డుకోవడానికి, విజయం సాధించడానికి ఏమాత్రం సరిపోలేదు. రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే కుప్పకూలిన టీమ్‌ ఇండియా.. 132 పరుగుల ఛేదనలో కివీస్‌కు ఏమాత్రం కళ్లెం వేయలేకపోయింది. 

Also read: అసలు సమస్య ఇదీ: విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ గుట్టు విప్పిన కపిల్ దేవ్

బ్యాటింగ్‌ కష్టసాధ్యమైన పిచ్‌పై న్యూజిలాండ్‌ ఓపెనర్ల అర్ధ సెంచరీల ప్రదర్శన ఆతిథ్య జట్టుకు 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందించింది. న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌ పరాజయం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. 

ఇక ఈ సిరీస్ లో కోహ్లీ సేన ప్రదర్శన మరీ విడ్డూరంగా ఉండడం, కోహ్లీ కూడా పేలవ ప్రదర్శనను చేయడం వల్ల ఆయన కోపం కట్టలు తెంచుకుంది. స్లిప్స్ లో క్యాచ్ అందుకున్న కోహ్లీ, ఇండియన్ ఎక్ష్ప్రెస్ కథనం ప్రకారం న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తాం అని అన్నాడు. 

"జబ్ ఇండియా మే యే లోగ్ ఆయేంగే తబ్ ధికా దుంగ"  అని చాలా కోపంగా అన్నాడు. ఐసీసీ స్పిరిట్ అఫ్ క్రికెట్ అవార్డు అందుకున్న కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమయింది. 

విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో ఇలా నోరు పారేసుకోవడం రెండవసారి. ముందు రోజు న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ (5) బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండో స్లిప్ స్థానం నుంచి దూసుకొచ్చిన విరాట్‌ కోహ్లి.. కేన్‌ విలియమ్సన్‌ను చూస్తూ ఏదో అన్నాడు. 

Also read: అతను కెప్టెన్ గా పనికి రాడు: మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు

ఆ సమయంలో అభిమానుల వైపు సైతం చూశాడు. టీవీ ఆడియో రిప్లేలో కోహ్లి మాటలు రికార్డు కాలేదు. దీనిపై మ్యాచ్‌ అనంతరం క కోహ్లిని న్యూజిలాండ్‌ పాత్రికేయుడు ప్రశ్నించాడు. ' 

దీనిపై కోహ్లీ ఘాటుగా స్పందించాడు. మీరు (పాత్రికేయుడు) ఇక్కడ వివాదం సృష్టించాలని చూస్తున్నారా? అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అనే విషయాలు మీకు తెలుసా? అని ఆ జర్నలిస్టుపై విరుచుకుపడ్డాడు. ఆ విషయంపై మ్యాచ్‌ రిఫరికీ ఇప్పటికే వివరణ ఇచ్చానని, సగం సగం సమాచారంతో, సగం నాలెడ్జి తో ఇలా అడగవద్దని రుసరుసలాడారు. 

click me!