ఐపిఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్ కొత్త రకం హెలికాప్టర్ షాట్ వీడియోతో అందరినీ ఆకర్షించాడు. ఆ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ షేర్ చేసింది.
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హెలికాప్టర్ షాట్ గురించి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు తెలిసిందే. అదే విధమైన షాట్ కు ప్రయత్నించే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రషీద్ ఖాన్ ఓ వీడియోను పోస్టు చేశాడు. ఐపిఎల్ లో రషీద్ ఖాన్ సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే.
ధోనీ బాదే హెలికాప్టర్ షాట్ వంటిదే రషీద్ ఖాన్ వికెట్ల వెనకకూ బాదుతూ ఆ వీడియో కనిపించాడు. ఆ షాట్ కు సంబంధించిన వీడియోను రషీద్ ఖాన్ షేర్ చేస్తూ ఈ కోత్త షాట్ ను ఏమని పిలుస్తారని, దీన్ని హెలికాప్టర్ షాట్ అంటారా, లేదా అని అభిమానులను అడిగాడు. దీన్ని హెలికాప్టర్ షాట్ అంటారా, నేను అలాగే అనుకుంటున్నా అనే శీర్షికను పెట్టాడు. రషీద్ ఖాన్ వీడియోపై అతని జట్టు సహచరుడు హమీద్ హసన్ స్పందించాడు. దాన్ని నింజా కట్ అంటారని వ్యాఖ్యానించాడు.
Do you call it helicopter?? I think soo 🤔🤔🚁 pic.twitter.com/DXYL15TSS1
— Rashid Khan (@rashidkhan_19)రషీద్ ఖాన్ వీడియోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచేజీ సన్ రైజర్స్ హైదరాబాదు ట్విట్టర్ లో షేర్ చేసింది. రషీద్ ఖాన్ చివరగా ఫిబ్రవరి 1వ తేీదన ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరుఫున ఆడాడు. రషీద్ ఖాన్ షేర్ చేసిన వీడియో ఎప్పటిదనేది తెలియడం లేదు.
ధోనీ కొట్టే సంప్రదాయబద్దమైన హెలికాప్టర్ షాట్ సాధారణం లెగ్ సైడ్ మీడ్ వికెట్, లాంగ్ ఆర్ రీజియన్ లోకి వెళ్తుంది. రషీద్ షాట్ మాత్రం థర్ మ్యాన్ ఫెన్స్ దిశగా వెళ్లింది. దాంతో రషీద్ ఖాన్ కొట్టిన షాట్ ను చాలా మంది రివర్స్ హెలికాప్టర్ షాట్ అంటున్నారు.
also Read: ఆ క్యామెల్ బ్యాట్ తీసుకు రా: రషీద్ ఖాన్ తో హైదరాబాద్ సన్ రైజర్స్
రషీద్ ఖాన్ ప్రధానంగా లెగ్ స్పిన్నర్. అయితే, బ్యాటింగ్ లో కూడా తగిన విధంగా రాణిస్తుంటాడు. బీబీఎల్ లో బ్యాటింగ్ లో కూడా అతను తన ప్రదర్శన గొప్పగా చేశాడు. అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగిన మ్యాచులో క్యామెల్ బ్యాట్ పేరుతో కొత్త బ్యాట్ డిజైన్ ను చూపించి అందరినీ ఆకర్షించాడు.