ఆ హీరోయిన్ కోసమేనా, ఇషాన్ కిషన్ అంత కష్టపడ్డాడా..?

By telugu news teamFirst Published Sep 11, 2021, 8:25 AM IST
Highlights

అప్పుడు ఆమె విష్ చేయడం వల్లే ఇషాన్ సత్తా చాటాడంటూ నెటిజన్లు తెగ ట్రోల్‌ చేశారు. ఇప్పుడు ఇషాన్‌ ఏకంగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కావడంతో.. ప్రేయసి కోసం కష్టపడి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 

టీమిండియా క్రికెటర్లు.. బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు చాలా మంది చేసుకున్నారు. విరాట్-అనుష్క, హార్దిక్- నటాషాలు అలా ప్రేమ పెళ్లి చేసుకున్నవారే. తాజాగా.. వీరి జాబితాలోకి యువ క్రికెటర్ , ముంబయి ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా చేరతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. నెటిజన్లు ఈ యువ క్రికెటర్ ని ట్రోల్ చేయడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే.. టీమిండియా టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్‌.. ప్రముఖ మోడల్‌ అదితి హుండియాతో పీకల్లోతు ప్రేమలో ఉ‍న్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. ఇషాన్ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు అదితి అతన్ని ప్రత్యేకంగా అభినందించింది. దీంతో అప్పుడు ఆమె విష్ చేయడం వల్లే ఇషాన్ సత్తా చాటాడంటూ నెటిజన్లు తెగ ట్రోల్‌ చేశారు. ఇప్పుడు ఇషాన్‌ ఏకంగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కావడంతో.. ప్రేయసి కోసం కష్టపడి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, 2019 ఐపీఎల్‌లో చెన్నైతో మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇషాన్-అదితి హుండియాల మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ మ్యాచ్ లో ఇషాన్ ప్రదర్శనకు ఫిదా అయిన అదితి.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పొగడ్తల వర్షం కురిపించింది. 'నిన్ను చూసి నేనెంతగానో గర్వపడుతున్నాను బేబీ' అని తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇషాన్‌ను బేబీ అని సంబోధించడంలో అర్ధమేంటో అంటూ అప్పట్లో నెటిజన్లు రచ్చ రచ్చ చేశారు. ఇదిలా ఉంటే, అదితి హుండియా.. 2017లో మిస్‌ రాజస్థాన్‌గా ఎంపికైంది. ఈ అమ్మడుకు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పాటు సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. 
 

click me!