భారత బృందంలో కరోనా ఎఫెక్ట్... ప్రారంభానికి ముందు ఐదో టెస్టు రద్దు...

By Chinthakindhi RamuFirst Published Sep 10, 2021, 12:49 PM IST
Highlights

ప్రారంభానికి ముందు ఐదో టెస్టును రద్దు వేస్తూ నిర్ణయం తీసుకున్న ఇరు జట్లు... 

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నేడు ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు, ఆరంభానికి ముందు వాయిదా పడింది. టీమిండియాలో కరోనా కేసులు వెలుగు చూడడంతో ఐదో టెస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరు జట్లు..

నేడు ప్రారంభం కావాల్సిన టెస్టు, ఆదివారం రోజున ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతున్నా, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. గురువారం భారత బృందంలో మరో పాజిటివ్ కేసు వెలుగు చూడడంతో ఐదో టెస్టుకి ముందు గందరగోళ పరిస్థితి నెలకొంది...

నాలుగో రోజు నాలుగో రోజు ప్రారంభానికి ముందు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డాడు. అతనితో పాటు భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియోథెరపిస్ట్ కూడా ఐసోలేషన్‌కి వెళ్లారు.. నాలుగో టెస్టు ముగింపు రోజున ఈ ముగ్గురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది...

నిన్న జరిపిన పరీక్షల్లో భారత అసిస్టెంట్ ఫిజియో కూడా కరోనా బారిన పడినట్టు తేలింది. దీంతో గురువారం ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా పాల్గొనలేకపోయింది టీమిండియా. భారత క్రికెటర్లందరికీ కరోనా పరీక్షలు జరపగా, నెగిటివ్ రిజల్ట్ వచ్చింది...

దీంతో ఐదో టెస్టు సజావుగా ప్రారంభం అవుతుందని భావించారు. అయితే కరోనా బారిన పడిన అసిస్టెంట్ ఫిజియోతో భారత క్రికెటర్లు కాంటాక్ట్‌తో ఉండడంతో ముందు జాగ్రత్తగా టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు...

click me!