IPL Mega Auction: జనవరిలో ఐపీఎల్ మెగా వేలం..! డిసెంబర్ ఆఖరునాటికి ఫ్రాంచైజీలు వారి పేర్లను పంపాల్సిందే..

By team teluguFirst Published Oct 29, 2021, 4:39 PM IST
Highlights

IPL 2022: ఆటగాళ్ల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి  నిర్వహించే మెగా వేలం వచ్చే ఏడాది ఒకటో వారంలో జరుగువచ్చునని సమాచారం.

ఐపీఎల్-14 (IPL) ఇటీవలే ముగిసిందో లేదో తర్వాత సీజన్ కు సంబంధించిన వారర్తలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL2022) లో  రెండు కొత్త జట్లు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వాటిని లక్నో (Lucknow), అహ్మదాబాద్ (Ahmedabad) గా  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ-BCCI) కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలో అందరి కండ్లూ ఆటగాళ్ల వేలం మీద పడ్డాయి. 

ఇక  ఈ మెగా వేలా (IPL Mega Auction)నికి సంబంధించి కూడా బీసీసీఐ  వర్గాల నుంచి నిన్న కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇదివరకే ఉన్న 8 ఫ్రాంచైజీలు.. కనీసం నలుగురు ప్లేయర్లను నిలుపుకోవచ్చున (IPL TRetention Policy)ని బోర్డు వర్గాల నుంచి సమాచారం. అయితే అది ఇద్దరు  స్వదేశీ, ఇద్దరు విదేశీ ప్లేయర్లా..? లేక ముగ్గురు భారత, ఒక విదేశీ ఆటగాడా..? అన్నదానిమీద స్పష్టత రావాల్సి ఉంది. 

ఇది కూడా చదవండి: PV Sindhu: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్ లోకి ప్రవేశించిన పీవీ సింధు..

ఇక ఇప్పుడు మరో కొత్త వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.  ఆటగాళ్ల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి  నిర్వహించే మెగా వేలం వచ్చే ఏడాది ఒకటో వారంలో జరుగువచ్చునని సమాచారం. ఆలోపు.. అంటే డిసెంబర్ మాసాంతంలోపు ఇప్పుడు ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. తాము నిలుపుకోబోయే ఆటగాళ్ల పేర్లు అందజేయాల్సి ఉంటుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (IPL Governing Council) మెంబర్ ఒకరు తెలిపారు. 

ఇది కూడా చదవండి:T20 Worldcup: గెలవాలంటే వాళ్లిద్దరినీ తప్పించి ఇషాన్, శార్దూల్ ను తీసుకోండి.. విరాట్ కు గవాస్కర్ సూచన..

ఇదే విషయమై  ఆయన మాట్లాడుతూ.. ‘రాబోయే పది రోజుల్లో తర్వాత సీజన్ కు సంబంధించిన  అన్ని తేదీలు నిర్ణయించబడుతాయి. మేమిప్పటికే అన్ని ఫ్రాంచైజీలతో మాట్లాడాం. తాము నిలుపుకోబోయే నలుగురు ఆటగాళ్ల జాబితాతో పాటు ఇతర విషయాల గురించి కూడా చర్చించాం’ అని  అన్నారు. 

ఇది కూడా చదవండి: T20 Worldcup: మళ్లీ కెప్టెన్ గా ధోని..? ఓపెనర్ గా రోహిత్ శర్మ.. ఏ ఫ్రాంచైజీకో తెలుసా..?

కాగా.. ఈసారి ఐపీఎల్ వేలం పాటలో గతంలో మాదిరిగా ఆర్టీఎం అవకాశం ఉండకపోవచ్చునని తెలుస్తున్నది. ఆర్టీఎం (RTM) అంటే ‘రైట్ టు మ్యాచ్’. ఈ కార్డు ద్వారా తమ జట్టు వదులుకున్న ఆటగాడి కోసం వేలంలో మరో జట్టు అదే రేటును పాత ఫ్రాంచైజీ చెల్లించి వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఈసారి దానిపై కూడా స్పష్టత రాలేదు. 

click me!