Puneeth Rajkumar Death: ఇండియన్ సినిమాకి తీరని లోటు... సెహ్వాగ్ సహా క్రికెటర్ల సంతాపం

Published : Oct 29, 2021, 02:45 PM ISTUpdated : Oct 29, 2021, 04:22 PM IST
Puneeth Rajkumar Death: ఇండియన్ సినిమాకి తీరని లోటు... సెహ్వాగ్ సహా క్రికెటర్ల సంతాపం

సారాంశం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన పునీత్ రాజ్‌కుమార్... 

సాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ సీమతో పాటు భారతదేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్‌కుమార్‌ ఇక లేరని విషాద వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకి గురైన పునీత్ రాజ్‌కుమార్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘పవర్‌స్టార్’గా పిలవబడే పునీత్ రాజ్‌కుమార్‌కి అశేష అభిమానులు ఉండడంతో ముందు జాగ్రత్తగా కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసి వేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సినిమా థియేటర్లతో పాటు స్కూళ్లకు కూడా రెండు రోజులు సెలవు ప్రకటించారు. 

Also Read: Puneeth Rajkumar Death: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత..

పునీత్ రాజ్‌కుమార్‌కి క్రికెట్ ప్రపంచంతో కూడా మంచి అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంపై క్రికెటర్లు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు...

పునీత్ రాజ్‌కుమార్ మరణంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ‘పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అందరితో ఎంతో హుందాగా, వినయంగా ఉండేవారు. పునీత్ రాజ్‌కుమార్ మరణం ఇండియన్ సినిమాకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు...

 

భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా పునీత్ రాజ్‌కుమార్‌కి నివాళి ఘటించారు. ‘పునీత్ రాజ్‌కుమార్ లేరనే విషయం తెలిసి షాక్‌కి గురయ్యాను. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. ఆయన అభిమానులు సమన్వయంతో మెలుగులూ, పునీత్ రాజ్‌కుమార్ ఆత్మకు శాంతి చేకూర్చుతారని కోరుకుంటున్నా... ఓం శాంతి...’ అంటూ ట్వీట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్.

పునీత్ రాజ్‌కుమార్ మరణంపై క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వేదా కృష్ణమూర్తి కూడా స్పందించారు. ‘పునీత్ రాజ్‌కుమార్ లేరని తెలిసి షాక్‌కి గురయ్యా. సినీ ఇండస్ట్రీలో ఓ జెమ్‌ని కోల్పోయింది. నేను కలిసిన వారిలో ఎంతో మంచి మనిషి. చాలా వినయంగా ఉండే ఇంత త్వరగా మనల్ని వెళ్లిపోవడం కలిచివేసింది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులను నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే..

 

భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా పునీత్ రాజ్‌కుమార్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు... ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?