IPL 2022: కొత్త ఫ్రాంఛైజీలుగా ఈ నగరాలకే అత్యధిక అవకాశం..!

By team teluguFirst Published Sep 22, 2021, 5:11 PM IST
Highlights

ప్రస్తుతానికి 8 జట్లున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 సీజన్‌ నుంచి పది జట్లతో అభిమానుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

కరోనా కారణంగా అర్థాంతరంగా వాయిదా పడ్డ ఐపీఎల్(IPL) ఇప్పుడు తిరిగి ప్రారంభమయింది. ఐపీఎల్ తిరిగిరావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దుబాయి లో ప్రేక్షకులను కూడా స్టేడియంలలోకి అనుమతిస్తుండడంతో జనాల కోలాహలంతో మైదానాలు మార్మోగుతున్నాయి. 

ప్రస్తుతానికి 8 జట్లున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) IPL 2022 సీజన్‌ నుంచి పది జట్లతో అభిమానుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎనిమిది జట్ల ఐపీఎల్‌ను పది జట్లకు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకోగా.. అందుకు సంబంధించి టెండరు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 

రెండు నూతన ప్రాంఛైజీల(New IPL Franchises) కోసం క్రికెట్‌ బోర్డు టెండర్లు ఆహ్వానించింది. కనీస ధర రూ. 2000 కోట్లుగా నిర్ణయించారు. దక్షిణాది నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌లు ఉండగా మరో ప్రాంఛైజీకి ఇక్కడ అవకాశం ఉంది. 

కేరళ రాష్ట్రం వేదికగా ఓ ప్రాంఛైజీని పెట్టవచ్చు. గతంలో కొచ్చి టస్కర్స్‌ యాజమాన్యంతో బీసీసీఐ న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీనికి తోడు ఐపీఎల్‌, క్రికెట్‌ టెలివిజన్‌ వీక్షకుల్లో అధిక శాతం హిందీ భాష మాట్లాడే ప్రాంతాల నుంచే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. 

దీంతో నూతన ప్రాంఛైజీలను హిందీ భాష మాట్లాడే ప్రాంతాల నగరాలకే కేటాయించేందుకు బోర్డు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్‌ (Ahmedabad), లక్నో (Lucknow) సహా గువహటి (Guwahati) నగరాలు ఐపీఎల్‌ ప్రాంఛైజీల రేసులో ముందున్నాయి. 

Also Read: నటరాజన్‌కి కరోనా పాజిటివ్, అతనితో పాటు మరో ఆరుగురు... నేటి మ్యాచ్‌కి లైన్ క్లియర్...

ధర్మశాల(Dharmasala), రాంచీ(Ranchi), కటక్‌లు(Cuttack) సైతం ఐపీఎల్‌ ప్రాంఛైజీల నగరాల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. నూతనంగా ప్రాంఛైజీలు దక్కించుకున్న వారు ఈ ఆరు నగరాల్లో ఎక్కడైనా జట్టును సొంతం చేసుకునే వీలుంది. 

రెండు కొత్త ప్రాంఛైజీల ద్వారా బీసీసీఐ సుమారు రూ.6000-7000 కోట్లు ఆశిస్తోంది. ఒక్కో ప్రాంఛైజీ రూ.3000-3500 కోట్ల వరకు సంపాదిస్తుందనే దీమా బోర్డు వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇకపోతే... ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా భూతం వదిలేలా కనిపించడం లేదు... ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్‌కి ముందు నిర్వహించిన పరీక్షల్లో సన్‌రైజర్స్‌ ప్లేయర్ నటరాజన్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది.

నటరాజన్‌‌కి ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం నట్టూని ఐసోలేషన్‌కి తరలించిన అధికారులు, అతనితో మరో ఆరుగురు క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్నట్టు గుర్తించారు.

Also Read: IPL 2021: కార్తీక్ ఆటకు బుమ్రా ఫిదా.. ఇదిగో రియాక్షన్..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ విజయ్ శంకర్, టీమ్ మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ శ్యామ్ సుందర్, డాక్టర్ అంజన వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ కేద్కర్, నెట్ బౌలర్ పెరియస్వామి గణేశన్‌... నట్టూతో క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్నట్టుగా గుర్తించారు... ముందుజాగ్రత్తగా నట్టూతో పాటు వీళ్లు కూడా ఐసోలేషన్‌లో గడపనున్నారు.

click me!