IPL2021 KKR vs SRH: మనోళ్లేం మారలేదు... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ముందు ఈజీ టార్గెట్..

By Chinthakindhi RamuFirst Published Oct 3, 2021, 9:13 PM IST
Highlights

8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... 26 పరుగులు చేసి రనౌట్ అయిన కేన్ విలియంసన్... మరోసారి బ్యాటింగ్ ఆర్డర్ విఫలం...

ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మిగిలిన మ్యాచుల్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి పరువు నిలబెట్టుకుంటుందని ఆశించిన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది...

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది...  మొదటి ఓవర్‌లోనే వృద్ధిమాన్ సాహా ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అయితే టీవీ రిప్లైలో బంతి, వికెట్ల పైనుంచి వెళ్తున్నట్టుగా స్పష్టంగా కనిపించింది. రివ్యూ తీసుకోకుండా పెవిలియన్ చేరిన సాహా, సన్‌రైజర్స్‌ను చిక్కుల్లో పడేశాడు...

ఆ తర్వాత 13 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన జాసన్ రాయ్, శివమ్ మావి బౌలింగ్‌లో అవుట్ కావడంతో 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్... 21 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన కేన్ విలియంసన్ రనౌట్ కాగా, ప్రియమ్ గార్గ్ 31 బంతుల్లో ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు... 

అభిషేక్ శర్మ 6, జాసన్ హోల్డర్ 2, రషీద్ ఖాన్ 8 పరుగులు చేసి అవుట్ కాగా అబ్దుల్ సమద్ 18 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేశాడు... భువనేశ్వర్ కుమార్ 7, సిద్ధార్థ్ కౌల్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు... కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా... షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ తీశాడు...

click me!