IPL2021 KKR vs SRH: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... కేకేఆర్‌ గెలిస్తేనే...

Published : Oct 03, 2021, 07:15 PM IST
IPL2021 KKR vs SRH: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... కేకేఆర్‌ గెలిస్తేనే...

సారాంశం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు...  పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కేకేేఆర్‌కి కీలకంగా మ్యాచ్ విజయం...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది... సీజన్‌లో కేవలం రెండే విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, పాయింట్ల పట్టికలో కాస్త పైకి రావాలన్నా మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచి తీరాల్సిందే...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కేకేఆర్‌కి ఈ మ్యాచ్ విజయం చాలా అవసరం... ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన ప్లేఆఫ్ బెర్తులను కన్ఫార్మ్ చేయడంలో కింగ్ మేకర్ పాత్ర పోషించనుంది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియంసన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమర్ మాలిక్, సిద్ధార్థ్ కౌల్...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు: శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్, షకీబ్ అల్ హసన్, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి.


 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో