IPL2021 CSK vs DC: హాఫ్ సెంచరీ చేసి అవుటైన పృథ్వీషా... నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ...

Published : Oct 10, 2021, 08:29 PM IST
IPL2021 CSK vs DC: హాఫ్ సెంచరీ చేసి అవుటైన పృథ్వీషా... నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ...

సారాంశం

80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్... 60 పరుగులు చేసి అవుటైన పృథ్వీషా... కీలక మ్యాచ్‌లో శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ ఫెయిల్...

ఐపీఎల్ 2021 మొదటి క్వాలిఫైయర్‌లో టాస్ ఓడి, బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్, వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్‌, 7 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా 8 బంతుల్లో ఒకే పరుగు చేసి హజల్‌వుడ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు... బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ 11 బంతుల్లో 10 పరుగులు చేసి మొయిన్ ఆలీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో పృథ్వీషా క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీపక్ చాహార్ వేసిన 3వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదిన పృథ్వీషా, శార్దూల్ ఠాకూర్ వేసిన ఐదో ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు...

27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న పృథ్వీషా, ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో అర్ధశతకం బాదిన మొట్టమొదటి ఢిల్లీ ప్లేయర్‌గా నిలిచాడు... 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసిన పృథ్వీషా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి డుప్లిసిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

నాలుగో వికెట్ కోల్పోయే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 80 పరుగులు చేస్తే, అందులో 60 పరుగులు షా చేసినవే కావడం విశేషం...

PREV
click me!

Recommended Stories

IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే
IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!