ఐపిఎల్ 2020... కోహ్లీ చెత్త రికార్డును బద్దలు కొట్టిన ఊతప్ప

By Arun Kumar PFirst Published Oct 1, 2020, 10:13 AM IST
Highlights

ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో వున్న ఈ చెత్త రికార్డు తాజాగా ఊతప్ప పేరిట నమోదయ్యింది. 

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఓ చెత్త రికార్డు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఖాతాలో చేరింది. బుధవారం కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో రాజస్థాన్ చిత్తుగా ఓడటంతో ఐపిఎల్ లో అత్యధిక ఓటములను చవిచూసిన ఆటగాడిగా ఊతప్ప నిలిచాడు. ఇంతకాలం ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో వున్న ఈ చెత్త రికార్డు తాజాగా ఊతప్ప పేరిట నమోదయ్యింది. 

ఇప్పటివరకు ఊతప్ప ప్రాతినిధ్యం వహించిన జట్టు ఓటముల సంఖ్య 91 కి చేరుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ, దినేష్ కార్తిక్, రోహిత్ శర్మ, అమిత్ మిశ్రాలు నిలిచారు. బెంగళూరు కెప్టెన్ కోహ్లీ 90, కెకెఆర్ కెప్టెన్ కార్తిక్ 87, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 85 మరియు అమిత్ మిశ్రా 57 ఓటములను చవిచూశారు. 

video   రాజస్థాన్ వర్సెస్ కోల్‌కత: ఆర్ఆర్ ను దెబ్బతీసిన షార్జా విజయం

ఐపిఎల్ 2020 సీజన్ 13లో తొలి రెండు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్ బుధవారం తొలి పరాజయాన్ని చవి చూసింది. బౌలింగ్‌లో బాగానే ఆకట్టుకున్నా, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన రాయల్స్ టీం కోల్‌కత్తా చేతిలో చిత్తుగా ఓడింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు మొదటి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్ కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది.

కెప్టెన్ స్టీవ్ స్మిత్ 3 పరుగులకు, సంజూ శాంసన్ 8 పరుగులకు అవుట్ కాగా జోస్ బట్లర్ 16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  రాబిన్ ఊతప్ప 2, రియాన్ పరాగ్ 1 పరుగు చేసి అవుట్ కాగా లాస్ట్ మ్యాచ్ ‘గేమ్ ఛేంజర్’ 14 పరుగులు చేశాడు. శ్రేయాస్ గోపాల్ 5, ఆర్చర్ 6, ఉనద్కడ్ 9 పరుగులు చేయగా టామ్ కుర్రాన్ ఒంటరి పోరాటం చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టామ్ కుర్రాన్, అంకిత్ రాజ్‌పుత్ చివర్లో దూకుడుగా ఆడడంతో ఆలౌట్ కాకుండా తప్పించుకుంది రాజస్థాన్ రాయల్స్. శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, కమ్లేశ్ నాగర్‌కోటి రెండేసి వికెట్లు తీయగా సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ తీశారు. 


 

click me!