RRvsKKR: చిత్తుగా ఓడిన రాజస్థాన్ రాయల్స్... సీజన్‌లో తొలి పరాజయం...

By team teluguFirst Published Sep 30, 2020, 11:19 PM IST
Highlights

సీజన్‌లో తొలి ఓటమి చవిచూసిన రాజస్థాన్ రాయల్స్...

సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ ఫెయిల్యూర్‌తో కుదేలైన ఆర్ఆర్ బ్యాటింగ్...

అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

హాఫ్ సెంచరీ చేసిన టామ్ కుర్రాన్... 37 పరుగుల తేడాతో కేకేఆర్ ఘనవిజయం...

IPL 2020 సీజన్ 13లో తొలి రెండు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, సీజన్‌లో తొలి పరాజయాన్ని చవి చూసింది. బౌలింగ్‌లో బాగానే ఆకట్టుకున్నా, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై కోల్‌కత్తా చేతిలో చిత్తుగా ఓడింది రాజస్థాన్. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు మొదటి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్ కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది.

కెప్టెన్ స్టీవ్ స్మిత్ 3 పరుగులకు, సంజూ శాంసన్ 8 పరుగులకు అవుట్ కాగా జోస్ బట్లర్ 16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  రాబిన్ ఊతప్ప 2, రియాన్ పరాగ్ 1 పరుగు చేసి అవుట్ కాగా లాస్ట్ మ్యాచ్ ‘గేమ్ ఛేంజర్’ 14 పరుగులు చేశాడు. శ్రేయాస్ గోపాల్ 5, ఆర్చర్ 6, ఉనద్కడ్ 9 పరుగులు చేయగా టామ్ కుర్రాన్ ఒంటరి పోరాటం చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టామ్ కుర్రాన్, అంకిత్ రాజ్‌పుత్ చివర్లో దూకుడుగా ఆడడంతో ఆలౌట్ కాకుండా తప్పించుకుంది రాజస్థాన్ రాయల్స్. శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, కమ్లేశ్ నాగర్‌కోటి రెండేసి వికెట్లు తీయగా సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ తీశారు. 

click me!