తాజాగా ఓ నవ జంట తమ వెడ్డింగ్ కార్డుని విభిన్నంగా డిజైన్ చేయించుకున్నారు. ఆ కార్డును చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా పెళ్లి పత్రికను తయారు చేస్తారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వెరైటీ కార్డు ఏమిటి.. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లంటే నూరేళ్ల పంట. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదో మధురమైన జ్ఞాపకం. అందుకే నవ జంట తమ స్థాయిని బట్టి, ఎప్పటికీ మర్చిపోని విధంగా పెళ్లి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే నిశ్చితారం మొదలు ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లి కార్యక్రమం ముగిసే వరకు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తారు. ప్రతీది తమ జీవితాంతం గుర్తుండి పోయేలా నవ జంట తమ పెళ్లి తంతు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తుంటారు.
ఈ తరుణంలోనే కొంతమంది కాస్తా వైవిధ్యంగా, వెరైటీగా జరుపుకోవాలని భావిస్తారు. ఈ మధ్యకాలంలో కొంత మంది తమ పెళ్లి కార్డులను చిత్ర విచిత్రంగా తయారు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ జంట క్రికెట్ మీద క్రేజ్ తో వెడ్డింగ్ కార్డుని డిపిరెంట్ గా డిజైన్ చేయించుకున్నారు. ఆ కార్డును చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా పెళ్లి కార్డును తయారు చేస్తారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వెరైటీ కార్డు ఏమిటి.. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ నవ జంట తమ వెడ్డింగ్ కార్డును ఐపీఎల్ థీమ్ లో డిజైన్ చేయించుకున్నారు. పెండ్లి పత్రికలో సీఎస్‌కే లోగోను ఉపయోగించి వారి పేర్లను ముద్రించారు. అలాగే మ్యాచ్ నమూనా టికెట్‌పై పెళ్లి సమయం, రిసెప్షన్ వంటి వివరాలను తెలియజేశారు. అలాగే.. రివ్యూ, మ్యాచ్ ప్రిడక్షన్ అంటూ క్రికెట్ టికెట్ తలపించేలా ఇన్విటేషన్ తయారు చేయించారు.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ థీమ్‌తో రూపొందించిన ఈ పెళ్లి పత్రిక ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. వధూవరులిద్దరికి క్రికెట్ అంటే ఎంత అభిమానం అంట.. అందుకే ఇలా తమ పెండ్లి పత్రికను ఇలా డిజైన్ చేయించుకున్నారు. మరికొంతమంది వెడ్డింగ్ కార్డు ను పట్టుకొని ఫోటోలోకు ఫోజులు ఇస్తూ.. న్యూ కపుల్స్ కు కంగ్రాట్స్ చెప్పుతున్నారు.