India vs Bangladesh T20 series : సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఇటీవల ముగిసిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది.
India vs Bangladesh T20 series : హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బంగ్లాదేశ్ తో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తలపడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిండ్ మూడు విభాగాల్లో భారత జట్టు అద్బుత ప్రదర్శన చేసి బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-0 సొంతం చేసుకుంది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 6 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో భారత్ తలపడనుంది. టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌లకు నజ్ముల్ హొస్సేన్ శాంటో నాయకత్వం వహిస్తుండగా, భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నారు. ఈ సిరీస్ లో మ్యాచ్ లు అన్ని కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి.
undefined
1. శ్రీ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం, గ్వాలియర్ - అక్టోబర్ 6, ఆదివారం
2. అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ - అక్టోబర్ 9, బుధవారం
3. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ - అక్టోబర్ 12, శనివారం
బంగ్లాదేశ్ టీ20 జట్టు :
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మద్ ఉల్లా, లిట్టన్ కుమర్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షాక్ మహేదీస్ హసన్, రిషాఫ్ హసన్, రిషాఫ్ హసన్ తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, రకీబుల్ హసన్.
భారత టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.
IND vs BAN 1వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ వేదిక ఏది?
గ్వాలియర్‌లోని మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ 2వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే వేదిక ఏది?
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.
భారత్ vs బంగ్లాదేశ్ 3వ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ వేదిక ఏది?
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.
భారత్ vs బంగ్లాదేశ్ టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో లైవ్ టాస్ టైమింగ్స్ ఏమిటి?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్ సందర్భంగా లైవ్ టాస్ 6:30 PM ISTకి జరుగుతుంది.
భారత్ vs బంగ్లాదేశ్ T20 సిరీస్‌లో ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ చూడవచ్చు?
మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ లైవ్ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ 18 ఇండియా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌ను భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే, జియో సినిమా ఇండియా vs బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌ని హిందీ, ఇంగ్లీష్ సహా తొమ్మిది భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ రాబోయే టీ20 సిరీస్ లో ఎలాగైనా భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. టీ20 క్రికెట్ విషయానికి వస్తే ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. టీ20 క్రికెట్ లో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో నేతృత్వంలోని బంగ్లాదేశ్ టీమ్ గత ఐదు సిరీస్ లలో ఒక దాన్ని మాత్రమే గెలుచుకుంది. ఈ ఏడాది మేలో స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1 తేడాతో బంగ్లాదేశ్ గెలుచుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2024లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, భారత్ చేతిలో ఓడిపోయిన బంగ్లాదేశ్ సూపర్ 8ను దాటలేకపోయింది. భారత్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. అలాగే, అంతర్జాతీయ టీ20 క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో భారత్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీ20 క్రికెట్ లో కొత్త శకాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే సీజన్లలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ యంగ్ ప్లేయర్లతో బలమైన జట్టును తయారు చేయాలని చూస్తోంది.