IPL 2025 RCB vs PBKS : హేజిల్‌వుడ్ ఫైనల్ సెంటిమెంట్... గెలుపు ఆర్సిబిదేనా?

Published : Jun 03, 2025, 10:21 PM IST
IPL 2-025 Final

సారాంశం

190 పరుగుల్ని ఆర్‌సిబి కాపాడుకుంటుందా? పంజాబ్ ఈ స్కోర్‌ని ఛేజ్ చేస్తుందా అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్‌సిబి అభిమానులకు ఓ గణాంకం ఊరటనిస్తోంది. అదేంటంటే… 

Ahmedabad: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా ఆడి 190 పరుగులు చేసింది. అయినా ఇది ఫైనల్ మ్యాచ్, అహ్మదాబాద్ బ్యాటింగ్ పిచ్ కావడంతో ఆర్‌సిబి గెలుపుపై చర్చ జరుగుతోంది. 190 పరుగుల్ని ఆర్‌సిబి డిఫెండ్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఛేజింగ్ జట్టుకు కొన్ని అడ్వాంటేజ్‌లు ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. అయితే ఆర్‌సిబి పేసర్ జోష్ హేజల్‌వుడ్ ఆడిన ఏ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇది ఆర్‌సిబి అభిమానులకు కాస్త ఊరటనిస్తోంది.

8 ఫైనల్స్‌లో 8 విజయాలు

ఆర్‌సిబి పేసర్ జోష్ హేజల్‌వుడ్ అండర్-19, ప్రపంచకప్, ఐపీఎల్‌తో కలిపి మొత్తం 8 ఫైనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ 8 మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. ఇప్పుడు 9వ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ జోష్ హేజల్‌వుడ్ తన రికార్డును కొనసాగిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

2012లో జోష్ హేజల్‌వుడ్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ టోర్నీ ఫైనల్ ఆడాడు. సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడిన జోష్ హేజల్‌వుడ్ ట్రోఫీ గెలిచాడు. 2015 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టులో కీలక బౌలర్‌గా ఉన్న హేజల్‌వుడ్ ట్రోఫీ సాధించాడు. 2021 ఐపీఎల్ టోర్నీలో జోష్ హేజల్‌వుడ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగమయ్యాడు. 2021లో సీఎస్‌కే ట్రోఫీ గెలిచింది. 2021 టీ20 ప్రపంచకప్‌లో జోష్ హేజల్‌వుడ్ ఆస్ట్రేలియా జట్టులో ఉన్నాడు. ఈసారి ఆస్ట్రేలియా ట్రోఫీ గెలిచింది. 2023లో జోష్ హేజల్‌వుడ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాడు. ఆస్ట్రేలియా ట్రోఫీ గెలిచింది. ఇప్పుడు ఆర్‌సిబి తరఫున ఫైనల్ ఆడుతున్నాడు.

ఖరీదైన క్యాచ్ డ్రాప్

190 పరుగుల ఛేజింగ్‌లో పంజాబ్ మంచి ఆరంభం పొందింది. బౌండరీలు, సిక్సర్లతో పంజాబ్ చెలరేగింది. ఇది ఆర్‌సిబి ఆందోళన పెంచింది. ఈ క్రమంలో జోష్ హేజల్‌వుడ్ వేసిన బంతికి ప్రభ్‌సిమ్రాన్ కొట్టిన క్యాచ్ డ్రాప్ అయింది. రొమారియో షెఫర్డ్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ వదిలేశాడు. ఈ క్యాచ్ ఖరీదైనదేనా అనే చర్చ జరుగుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !