మాజీ క్రికెట‌ర్ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన షారుక్ ఖాన్.. నిజంగా నువ్వు గ్రేట్ బాసు..

By Mahesh Rajamoni  |  First Published May 22, 2024, 3:12 PM IST

IPL 2024 Shah Rukh Khan : ఐపీఎల్ 2024 క్వాలిఫ‌య‌ర్ 1లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) విజయం తర్వాత షారుక్ ఖాన్, త‌న కొడుకు అబ్రామ్, కుమార్తె సుహానాతో క‌లిసి గ్రౌండ్ లోకి  వ‌చ్చి చాలా సంతోషంగా క‌నిపించాడు. అయితే, ఈ క్ర‌మంలోనే చోటుచేసుకున్న ఒక ఘ‌ట‌న‌తో మాజీ క్రికెట‌ర్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.
 


IPL 2024 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్-2024) క్వాలిఫయర్-1 మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ను ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ టీమ్ 19.3 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే ఆలౌట్ ఆయింది. కేకేఆర్ 13.4 ఓవ‌ర్ల‌లో టార్గెట్ ను ఛేదించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గెలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) విజయం తర్వాత షారుక్ ఖాన్ గ్రౌండ్ లోకి వచ్చాడు. ఈ సమయంలో, కుమార్తె సుహానా, చిన్న కుమారుడు అబ్రామ్ కూడా షారుక్ ఖాన్‌తో ఉన్నారు. షారుక్ ఖాన్ తన పిల్లలతో కలిసి గ్రౌండ్ లో తిరుగుతూ అభిమానులకు ముకుళిత హస్తాలతో కృతజ్ఞతలు తెలిపారు. కేకేఆర్ ఫైన‌ల్ చేర‌డంతో షారుక్ చాలా సంతోషంగా కనిపించాడు. అయితే, గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నప్పుడు షారుక్ ఖాన్ పెద్ద తప్పు చేయడంతో ఒక తమాషా సంఘటన జరిగింది.

Latest Videos

మంచి ఊపులో ర‌నౌట్ .. బోరున ఏడ్చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయ‌ర్

మ్యాచ్ ముగిసిన తర్వాత షారుక్ ఖాన్ మైదానంలో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేస్తున్నాడు. అయితే, మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్ లు మ్యాచ్ తర్వాత విశ్లేషణ చేస్తున్నారు. అప్పుడు పొరపాటున షారుక్ ఖాన్ చూసుకోకుండా వారి లైట్ షో మ‌ధ్య‌లోకి వ‌చ్చేశాడు. వెంట‌నే అక్క‌డున్న ఆకాష్ చోప్రా, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్‌లను ఆప్యాయంగా కౌగిలించుకుని, చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 

doing his traditional victory lap 💜pic.twitter.com/zUdlCgRZla

— 😎Sourav Srkian Das😎 (@SrkianDas04)

 

షారుక్ ఖాన్‌పై సురేష్ రైనా ప్రశంసలు.. 

షారుఖ్ ఖాన్‌ని కలిసిన తర్వాత సురేష్ రైనా చాలా సంతోషంగా వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులో షారుక్ ఖాన్ న‌డుచుకున్న తీరును ప్రశంసించాడు. సురేశ్ రైనా తన పోస్ట్‌లో, 'ఎప్పుడూ మర్యాదగా ఉండే షారుక్ ఖాన్‌ను ఈ రోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. సూపర్ స్టార్ అయినప్పటికీ, అతను తన నమ్రత ఇమేజ్‌ని కాపాడుకుంటూ, ప్రతి ప‌ల‌క‌రింపులో వినయాన్ని ప్రదర్శిస్తాడు. ఫైనల్ చేరినందుకు కేకేఆర్ కు అభినందనలు! అని పేర్కొన్నాడు.

 

It was wonderful catching up with the always humble today. Despite his superstar status, he maintains his down-to-earth demeanor, showcasing humility in every interaction. Congratulations to KKR for making it to the finals! 🏏✨ pic.twitter.com/dOPvyidPpY

— Suresh Raina🇮🇳 (@ImRaina)

 

 ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో వీరి ఆట‌ను చూడాల్సిందే..

click me!