Virat Kohli : టీ20 క్రికెట్ లో తన స్ట్రైక్ రేటుపై చేస్తున్న ట్రోలింగ్, విమర్శల మధ్య స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తన ఆట గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరంలేదంటూ ఫైర్ అయ్యారు.
Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుస ఓటముల తర్వాత అద్భుతమైన పునరాగమనంతో మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సూపర్ ప్రదర్శనతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ లో చోటుదక్కించుకుంది. అయితే, ఐపీఎల్ 2024 ప్రారంభం నుంచి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ స్ట్రైక్ రేటులో పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్లేఆఫ్స్ లో బిగ్ ఫైట్ కు సిద్ధమవుతున్న తరుణంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన టీ20 స్ట్రైక్ రేట్ గురించి ఇటీవలి విమర్శలపై ఘాటుగా స్పందించారు.
కింగ్ కోహ్లీ తన బ్యాటింగ్ గురించి విమర్శలు వచ్చినప్పుడు పెద్దగా స్పందించేవాడు కాదు కానీ, సారి మాత్రం ఆ విమర్శలపై ఘాటు స్పందించాడు. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ తో ఇద్దరు దిగ్గజాల మధ్య మాటల యుద్ధం తీవ్రత పెరిగింది. గవాస్కర్ విమర్శలు.. కోహ్లీ సమాధానంతో క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.
SRH VS PBKS: అభిషేక్ శర్మ దెబ్బకు బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. !
కింగ్ కోహ్లీ జియో సినిమాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న విమర్శలపై ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదంటూ.. తన ఆట గురించి తనకు తెలుసుననీ, ఎవరికీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా స్పందించాడు. "నేను అస్సలు స్పందించాల్సిన అవసరం లేదు. గ్రౌండ్‌లో నేను ఏమి చేయగలనో నాకు తెలుసు, నేను ఎలాంటి ఆటగాడిని, నా సత్తా ఏమిటో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా అని నేను ఎవరినీ అడగలేదు. ఒక మ్యాచ్‌ని గెలవడానికి (నా జట్టు కోసం) నేను విఫలమవడం ద్వారా నేనే నేర్చుకున్నాను, మీరు జట్టు కోసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు గెలిచారు అక్కడ పదే పదే విజయం సాధిస్తే అది యాదృచ్ఛికంగా జరగదు" అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీకి కూడా చోటుదక్కింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కింగ్ కోహ్లీ 14 ఇన్నింగ్స్‌లలో 155.60 స్ట్రైక్ రేట్‌తో 708 పరుగులతో ఐపీఎల్ 2024 పరుగుల స్కోరింగ్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో మొదటి 8 మ్యాచ్ లలో ఏడింటిలో ఓటమి పాలైన ఆర్సీబీ.. ఆ తర్వాత అద్భుతమైన ఆటతో లీగ్ దశలో తమ చివరి 6 మ్యాచ్ లలో విజయం సాధించి ప్లేఆఫ్స్ లో చోటుదక్కించుకుంది.
IPL 2024: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఫైర్.. అసలు గొడవేంటి..?