IPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ఇక దబిడిదిబిడే.. !

By Mahesh Rajamoni  |  First Published Mar 20, 2024, 12:29 PM IST

IPL 2024 : ఐపీఎల్ 2024 సీజ‌న్ లో మార్చి 23న మొహాలీలో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ త‌న తొలి మ్యాచ్ ఆడ‌నుంది. దాదాపు 14 నెల‌ల త‌ర్వాత టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ రిష‌బ్ పంత్ మ‌ళ్లీ ఐపీఎల్ తో గ్రౌండ్ లోకి దిగ‌నున్నాడు.
 


Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ‌ సీజన్ (ఐపీఎల్ 2024) మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే జ‌ట్ల‌న్ని మెగా లీగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనే ఊహాగానాల మ‌ధ్య ఫ్రాంచైజీ కీల‌క ఆప్ డేట్ ఇచ్చింది. దాదాపు 14 త‌ర్వాత గ్రౌండ్ లోకి ఆడుగుపెట్ట‌బోతున్న టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ రిషబ్ పంత్‌ను రాబోయే సీజన్‌కు కెప్టెన్‌గా ఢిల్లీ టీమ్ ఎంపిక చేసింది.ఫ్రాంచైజీ షేర్ చేసిన వీడియోలో "కమ్‌బ్యాక్ పూర్తయింది.. రీఎంట్రీకి స్వాగతం కెప్టెన్ రిషబ్ పంత్" కెప్టెన్సీ అంటూ ట్వీట్ చేసింది. రిష‌బ్ పంత్ లేక‌పోవ‌డంతో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని క్యాపిటల్స్ గ‌త సీజ‌న్ (ఐపీఎల్ 2024) ను ఆడింది.

 

COMEBACK DONE 👉🏼 NOW WELCOME BACK, CAPTAIN RISHABH PANT 💙❤️ pic.twitter.com/wN7xDgLW31

— Delhi Capitals (@DelhiCapitals)

Latest Videos

IPL 2024 లో కొత్త రూల్.. స్మార్ట్ రీప్లే సిస్టమ్ అంటే ఏమిటో తెలుసా?

కాగా, డిసెంబరు 2022లో ఘోరమైన కారు ప్రమాదానికి గురైన తర్వాత రిష‌బ్ పంత్ 14 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్ తో దుమ్మురేప‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ''రిషబ్ పంత్ ను తిరిగి కెప్టెన్ గా ఆహ్వానించడం సంతోషంగా ఉంది. పట్టుదల, నిర్భయత ఎల్లప్పుడూ అతని క్రికెట్ బ్రాండ్ ను నిర్దేశించాయి. అతను కోలుకునే మార్గాన్ని కూడా నిర్దేశించడంలో ఆశ్చర్యం లేదు. కొత్త అభిరుచి, ఉత్సాహంతో కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తున్నందున అతను మరోసారి మా జట్టును ముందుకు నడిపించడాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నాం'' అని ఢిల్లీ క్యాపిట‌ల్స్ చైర్మన్, సహ యజమాని పార్థ్ జిందాల్ అన్నారు.

మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్లు త‌ల‌ప‌డున్నాయి. ఈ  సీజ‌న్ లో మార్చి 23న మొహాలీలో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఆడ‌నుంది. కారు ప్ర‌మాదం నుంచి రిష‌బ్ పంత్ కోలుకోవ‌డానికి దాదాపు 14 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. 26 ఏళ్ల అతను నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ద్వారా ఫిట్ నెస్ క్లియ‌రెన్స్ ను పొందిన త‌ర్వాత మ‌ళ్లీ క్రికెట్ గ్రౌండ్ లో దిగుతున్నాడు. బీసీసీఐ షేర్ చేసిన ఒక వీడియోలో ప్ర‌స్తుతం తాను సాధార‌ణ స్థితిలో ఉన్న‌ట్టు తెలిపాడు. మ‌రొక వీడియోలో బ్యాట్ తో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ హార్ట్ బ్రేకింగ్ పోస్టు.. ఆందోళ‌న‌లో అభిమానులు.. ఐపీఎల్ నుంచి ఔటేనా?

click me!