Rishabh Pant: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదం కారణంగా దాదాపు ఏడాది పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్ 2024 నుంచి క్రికెట్ గ్రౌండ్ లోకి దిగబోతున్నాడు. అయితే, పంత్ పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Rishabh Pant - Sunil Gavaskar : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని టీమ్ టైటిల్ గెలుపు కోసం వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ సైతం తమ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ మళ్లీ తిరిగి రావడంతో ఫుల్ జోష్ తో ప్రాక్టిస్ కొనసాగిస్తోంది. దాదాపు ఏడాది కాలం తర్వాత ఐపీఎల్ 2024 నుంచి క్రికెట్ ఫీల్డ్‌లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు పంత్. అయితే, మెగా టోర్నీ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పంత్ పై చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభంలో రిషబ్ పంత్ తన అత్యుత్తమ ఫామ్‌ను తిరిగి పొందడం చాలా కష్టమని భారత గొప్ప క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే అతను మరింత ఎక్కువగా బ్యాటింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత అతని మోకాలు మెరుగవుతాయని నమ్ముతున్నాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా మెరుగ్గా కదకలికలు ఉండాలని పేర్కొన్నారు. కాగా, డిసెంబర్ 2022లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. 14 నెలల తర్వాత క్రికెట్ గ్రౌండ్ లోకి తిరిగి వస్తున్నాడు. దీని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కఠినమైన 'పునరావాస' కార్యక్రమంలో పాల్గొన్నాడు.
undefined
IPL 2024: అదిరిపోయింది.. విరాట్ కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్‌ని చూశారా.. !
"ఇది (తిరిగి గ్రౌండ్ లోకి రావడం) చాలా కష్టం, కానీ మంచి విషయం ఏమిటంటే అతను కొంత క్రికెట్ ఆడాడు. అతను కొంత ప్రాక్టీస్ చేసాడు. బ్యాటింగ్‌లో లయను కనుగొనడం కొంచెం కష్టమే" అని గవాస్కర్ అన్నాడు. మీరు మోకాలి గాయం గురించి మాట్లాడేటప్పుడు, మోకాలి కదలిక దెబ్బతింటుంది, వికెట్ కీపింగ్ కూడా కష్టమే, కానీ బ్యాటింగ్‌లో మోకాలు కదలికలు చాలా ముఖ్యమైనది, అందుకే మొదట్లో మనం అలాంటి రకాన్ని చూడలేకపోయామని" అన్నాడు పంత్ ఉనికి, అతని మాట్లాడే స్వభావం అతన్ని వినోదభరితంగా ఉంచుతున్నాయని గవాస్కర్ అంగీకరించాడు. స్టంప్‌ల వెనుక నుండి చమత్కారమైన వ్యాఖ్యలు చేస్తూ పూర్తి వినోదాన్ని అందించే వికెట్‌కీపర్‌ని పొందడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారని అన్నారు.
ఎందుకంటే వికెట్‌కీపర్‌కి రకరకాల మాటలు చెప్పి బ్యాట్స్‌మెన్ దృష్టి మరల్చడమే పంత్‌కి అంత సామర్థ్యం ఉంది, అయితే పంత్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌ని టార్గెట్ చేసినా నవ్వుతూ ఆనందించే సామర్థ్యం ఉంది కానీ అతని దృష్టి చెదిరిపోతే అది జట్టుతో పాటు అందరికీ హానికరమని అన్నాడు. ఇదిలావుండగా, ఐపీఎల్ 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 23న తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. దీని తర్వాత ఆ జట్టు మార్చి 28న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. మూడో మ్యాచ్‌లో ఆ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. నాలుగో మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో, ఆ తర్వాతి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
IPL 2024 : వచ్చాడురా జరుగుజరుగు.. ముంబైకా రాజా... !