IPL 2024 : వ‌చ్చాడురా జ‌రుగుజ‌రుగు.. ముంబైకా రాజా... !

By Mahesh Rajamoni  |  First Published Mar 19, 2024, 12:50 PM IST

Rohit Sharma's blockbuster entry: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17 సీజ‌న్ లో భార‌త కెప్టెన్, స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహించడం లేదు. అతని స్థానంలో స్టార్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా నియమితుల‌య్యారు. 
 


Mumbai Indians - Rohit Sharma : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్న‌మెంట్ కోసం దేశ‌విదేశీ ప్లేయ‌ర్ల‌తో కూడిన ప‌ది జ‌ట్లు ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. తొలి మ్యాచ్ లో ఢిపెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్, విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరులు త‌ల‌ప‌డున్నాయి. చెన్నై వేదిక‌గా ప్రారంభం కానున్న ప్రారంభ మ్యాచ్ సంద‌ర్భంగా ఘ‌నంగా వేడుక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

ఇదిలావుండ‌గా, ఐపీఎల్ లో విజ‌య‌వంత‌మైన టీమ్ గా కొన‌సాడుతున్న ముంబై ఇండియ‌న్స్ ఈ సారి క‌ప్పు గెలువ‌డ‌మే ల‌క్ష్యంగా టీమ్ లో ఊహించ‌ని మార్పులు చేసింది. జ‌ట్టుకు ఐదు టైటిళ్ల‌ను అందించిన రోహిత్ శ‌ర్మ‌ను మ‌రింత స్వేచ్ఛ‌గా ఆడేందుకు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను మ‌రొక‌రికి అప్ప‌గించింది. ఈ క్ర‌మంలోనే హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ రాబోయే ఐపీఎల్ కోసం ముంబై జ‌ట్టుతో చేరాడు. అయితే, రాయ‌ల్ గా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ కు సంబంధించిన ఒక వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Latest Videos

ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లే లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 క్రికెట‌ర్లు వీరే..

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ రాకను ఉల్లాసంగా ప్రకటించింది. "కోయి భీ గార్డెన్ మే ఘుమేగా, మా సి*** దుంగా సబ్‌కి"ని అంటూ రోహిత్ స్టంప్ మైక్ డైలాగ్స్ తో హిట్ మ్యాన్ రాకకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా రోహిత్ చేసిన ఈ వ్యాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియో "వో ఆ గయా…రో ఆ గయా" అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసారు . అలాగే, వీడియోలో ఒక బాలుడు తన స్నేహితుడికి, "వో ఆ గయా. జో గార్డెన్ మే ఘూమ్నే నహీ దేతా" అంటూ వీడియో షురూ అయింది.

 

𝗪𝗢𝗛 𝗔𝗔 𝗚𝗔𝗬𝗔… 𝗥𝗢 𝗔𝗔 𝗚𝗔𝗬𝗔! 🔥 pic.twitter.com/TId1LOUgnr

— Mumbai Indians (@mipaltan)

ఇదిలావుండ‌గా, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, రోహిత్ శర్మ తనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఉంటాడనీ, హిట్ మ్యాన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పాడు. "ఇది ఇబ్బందికరంగా లేదా భిన్నంగా ఉంటుందని నేను అనుకోను. మేం పదేళ్లుగా ఆడుతున్నాం కాబట్టి మంచి అనుభూతి కలుగుతుంది. నా కెరీర్ మొత్తం అతని కిందే ఆడాను, సీజన్ మొత్తం అతను నా భుజంపై చేయి వేయబోతున్నాడు" అని పాండ్యా అన్నాడు.

IPL 2024 : లక్నో జట్టులో చేరిన‌ కేఎల్ రాహుల్.. ఫిట్‌గా ఉన్నాడు కానీ..

click me!