Virat Kohli: మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ లో ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్, విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులు తలపడున్నాయి.
Royal Challengers Bangalore - Virat Kohli: వ్యక్తిగత కారణాలతో కొన్నివారాలుగా క్రికెట్ కు దూరంగా వున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని గ్రౌండ్ లో చూడటానికి క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ పితృత్వ సెలవుపై లండన్‌లో రెండు నెలలు గడిపిన తర్వాత ఐపీఎల్ కోసం ఇండియాకు తిరిగి వచ్చాడు. ఐపీఎల్ 2024 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్రాక్టిస్ లో చేరాడు. అయితే, ప్రస్తుతం విరాట్ కోహ్లీ సరికొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ కోహ్లీకి సంబంధించిన కొత్త హెయిర్ స్టైన్ లుక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి సంబంధించి చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కింగ్ కోహ్లీ కొత్త లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లే లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 క్రికెటర్లు వీరే..
ఇదిలావుండగా, సోమవారం ఆర్సీబీ స్క్వాడ్‌లో తిరిగి చేరాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్చి 22న చెన్నైలో సీఎస్కేతో జరిగే మ్యాచ్ కు ముందు కోహ్లీ తన ప్రాక్టీస్ సెషన్‌లను తిరిగి ప్రారంభించాడు. తన కొడుకు పుట్టిన తరువాత కుటుంబంతో ఉండటం కోసం విరాట్ కోహ్లీ ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ కు దూరంగా ఉన్నాడు. కింగ్ కోహ్లీ 2008 నుండి ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 237 మ్యాచ్‌లలో 7 సెంచరీలు, 50 అర్ధ సెంచరీలతో 37.25 సగటుతో 7263 పరుగులు సాధించాడు. కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో 643 ఫోర్లు, 234 సిక్సర్లు బాదాడు.
IPL 2024 : వచ్చాడురా జరుగుజరుగు.. ముంబైకా రాజా... !