హార్దిక్ పాండ్యాకు అంత ఈజీ కాదు.. రోహిత్ కెప్టెన్సీ తొల‌గించ‌డంపై ముంబై మాజీ కామెంట్స్ వైర‌ల్ !

By Mahesh Rajamoni  |  First Published Mar 12, 2024, 10:10 PM IST

IPL 2024: రోహిత్ శర్మ 2013లో కెప్టెన్‌గా తన తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. ఆ త‌ర్వాత 2015, 2017, 2019, 2020ల‌లో  కూడా ముంబై టీమ్ ను ఛాంపియ‌న్ గా నిలిపాడు. వరుసగా 11 సీజన్ల తర్వాత హార్దిక్ పాండ్యా రాకతో రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించారు.
 


IPL 2024 - Mumbai Indians: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి టైటిల్ గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా ఉన్న ముంబై టీమ్ అనేక మార్పులు చేసింది. ఐదు సార్లు జ‌ట్టును ఛాంపియ‌న్ గా నిలిపిన రోహిత్ శ‌ర్మ‌ను సైతం కెప్టెన్సీ నుంచి త‌ప్పించి హార్దిక్ పాండ్యాకు టీమ్ ప‌గ్గాలు అప్ప‌గించింది. ముంబై ఇండియ‌న్స్ కు సుదీర్ఘ సేవలందించిన స్టార్ల‌లో రోహిత్ శ‌ర్మ ఒక‌రు. 2011లో ఫ్రాంచైజీతో చేరిన త‌ర్వాత జ‌ట్టుకు అనేక విజ‌యాలు అందించాడు. ఐపీఎల్ 2013 సమయంలో రికీ పాంటింగ్ నుండి కెప్టెన్సీ ప‌గ్గాలు తీసుకున్నప్పుడు ఆరంభంలోనే జ‌ట్టుకు టైటిల్ ను అందించాడు.

ముంబై జ‌ట్టుకు 2013తో పాటు 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ టైటిల్ ను అందించాడు రోహిత్ శ‌ర్మ‌. 5,314 పరుగులతో ముంబై టీమ్ ప్లేయ‌ర్ల‌లో ఆల్ టైమ్ టాప్ స్కోరర్ గా కూడా ఉన్నాడు. వరుసగా 11 సీజన్ల తర్వాత హార్దిక్ పాండ్యా రాకతో రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించారు. గుజ‌రాత్ టైటాన్స్ రెండు సీజ‌న్లు ఆడిన త‌ర్వాత హార్దిక్ పాండ్యా తిరిగి మ‌ళ్లీ ముంబై జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే  రోహిత్ శ‌ర్మ నుంచి కెప్టెన్సీ మార్పు, హార్దిక్ పాండ్యాపై ముంబై జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ అంబ‌టి రాయుడు ఆ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టాడు.

Latest Videos

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 నుంచి విరాట్ కోహ్లీ ఔట్.. బీసీసీఐ షాకింగ్ డెసిషన్ !

ఒక మీడియా సంస్థ‌తో అంబటి రాయుడు మాట్లాడుతూ.. భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌ మరో ఏడాది పాటు ముంబై కెప్టెన్సీని కొనసాగించాల్సి ఉందని చెప్పాడు. జ‌ట్టులోని స్టార్ ప్లేయ‌ర్లను హ్యాండిల్ చేయ‌డం హార్దిక్ ప్యాండ్యాకు అంత ఈజీ కాద‌ని పేర్కొన్నాడు. "రోహిత్ శర్మను ఇంకా ఒక ఏడాది పాటు కెప్టెన్సీలో కొనసాగించాలి. హార్దిక్ ఒక సంవత్సరం పాటు ఆడి, ఆపై ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ పదవిని చేపట్టవచ్చు. రోహిత్ శర్మ ఇప్పటికీ భారత్‌కు టీ20 కెప్టెన్‌గా కొనసాగుతున్నాడని" అంబ‌టి రాయుడు పేర్కొన్నాడు.

అలాగే, గుజరాత్ టైటాన్స్ సెటప్ నుండి హార్దిక్ వస్తున్నందున ఇది కష్టమైన సీజన్. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉండటం కష్టం. వారు చాలా టైటిళ్లను గెలుచుకున్నారు కాబట్టి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్టార్ ప్లేయర్లందరినీ కలిసి హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు" అని అంబ‌టి రాయుడు అన్నాడు. కాగా, రాయుడు 2010-2017లో ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీ కోసం ఆడాడు, రోహిత్‌తో ఏడు సీజన్‌లు, హార్దిక్‌తో నాలుగు సీజన్‌లు ఆడాడు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ లో మూడు ఐపీఎల్ టైటిల్ విజయాల్లో భాగంగా ఉన్నాడు.

స్టార్ ప్లేయర్లను వెనక్కినెట్టి ఐసీసీ అవార్డు అందుకున్న యశస్వి జైస్వాల్

click me!