WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకు ఆలౌట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుతమైన ఆటతో డబ్ల్యూపీఎల్ 2024 నయా ఛాంపియన్ గా నిలిచింది.
Bangalore as new champion in WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిషన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో రాణించి సూపర్ విక్టరీ సాధించింది. బెంగళూరు టీమ్ ఫైనల్ మ్యాచ్ లో అద్బుత బౌలింగ్ తో రాణించింది. దీంతో పవర్ ప్లే తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకే ఢిల్లీ క్యాపిటల్స్ కీలకమైన 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా క్రీజులోకి వచ్చిన ప్లేయర్లు ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వరుసగా వికెట్లు సమర్పించుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో సోఫీ మోలినెక్స్ 3 వికెట్లు, ఆశా శోభన 2 వికెట్లు, శ్రేయాంక పాటిట్ 4 వికెట్లు తీసుకున్నారు.
బెంగళూరు ముందు 114 పరుగుల ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు టీమ్ చివరి ఓవర్ లో విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. కెప్టెన్న స్మృతి మంధాన 31 పరుగులు, సోఫీ డివైన్ 32 పరుగులు, ఎల్లీస్ ఫెర్రీ 35 పరుగులు, రిచాఘోష్ 17 పరుగలు చేసి బెంగళూరుకు విజయం అందించారు.
undefined
The Smriti Mandhana-led Royal Challengers Bangalore reign supreme! 🏆
Presenting before you - Champions of the 2024 ! 🙌 🙌
Congratulations, ! 👏 👏 | | | pic.twitter.com/mYbX9qWrUt
Ee Sala Cup N̶a̶m̶d̶e̶ Namdu! 🏆🥹 pic.twitter.com/jkubj1MRy6
— Royal Challengers Bangalore (@RCBTweets)అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్ ప్లే లో మంచి శుభారంభం లభించింది. షఫాలీ వర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసింది. తన ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన తర్వాత మోలినెక్స్ బౌలింగ్ లో క్యాచ్ గా వికెట్ల ముందు దొరికిపోయింది. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ 64-1 పరుగులతో పటిష్ఠ స్థితిలో కనిపించింది. అయితే, తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ డకౌట్ గా వెనుదిరిగింది.తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆలిస్ క్యాస్పేను కూడా సోఫీ మోలినెక్స్ దెబ్బకొట్టింది. మరిజానే కాప్ 8 పరుగులకు, జెస్ జోనాస్సెన్ 3 పరుగులు చేసి ఔట్ అయ్యారు.తొలి వికెట్ పడిన తర్వాత ఒత్తిడికి గురైన ఢిల్లీ బ్యాటర్స్ వరుసగా వికెట్లను సమర్పించుకున్నారు. రాధా యాదవ్ 12, అరుంధతి రెడ్డి 10 పరుగులు చేశారు. 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌట్ అయింది. బెంగళూరు ముందు 114 పరుగుల ఈజీ టార్గెట్ ను ఉంచింది. బెంగళూరు బౌలర్లలో సోఫీ మోలినెక్స్ 3 వికెట్లు, ఆశా శోభన 2 వికెట్లు, శ్రేయాంక పాటిట్ 4 వికెట్లు తీసుకున్నారు.
WPL Final 2024: ఒకే ఓవర్ లో 3 వికెట్లు.. ఢిల్లీని దెబ్బకొట్టిన సోఫీ మోలినెక్స్