అవే మా కోంపముంచాయి.. ఆట‌గాళ్ల‌పై ఢిల్లీ కెప్టెన్ ఫైర్..

By Mahesh Rajamoni  |  First Published May 13, 2024, 8:34 AM IST

Delhi Capitals : ఐపీఎల్ 2024 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. అయితే, ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓట‌మి త‌ర్వాత మాట్లాడుతూ త‌మ ఆట‌గాళ్ల‌పై కోపంతో ర‌గిలిపోయాడు.
 


Delhi Capitals : ఐపీఎల్ 2024 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ జ‌ట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తాత్కాలిక‌ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు  ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో పేలవమైన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ తో ఓట‌మి రూపంలో ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఢిల్లీ ఫీల్డర్లు ఏకంగా 4 క్యాచ్‌లను మిస్ చేశారు.

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ మాట్లాడుతూ త‌మ జ‌ట్టు ఓటమి గురించి మాట్లాడాడు. ఆట‌గాళ్ల పై కోపంతో ర‌గిలిపోయాడు. వ‌రుస‌గా క్యాచ్ ల‌ను వ‌దిలివేయ‌డంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశాడు.  కీలక సమయంలో వరుసగా నాలుగు క్యాచ్ లను వదిలివేయడం వల్లే మ్యాచ్ ను ఓడిపోయామని తమ  ఫీల్డిండ్, ఆటగాళ్లపై అసంతృప్తిని వ్య‌క్తంచేశాడు. దీంతో లైఫ్ ల‌భించిన రజత్ పాటిదార్ 32 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 52 పరుగులు, విల్ జాక్స్ 29 బంతుల్లో 41 పరుగులతో బెంగ‌ళూరు మంచి స్కోర్ సాధించ‌డంలో కీల‌కంగా ఉన్నారు.

Latest Videos

ఆర్ఆర్ పై సీఎస్కే సూప‌ర్ విక్ట‌రీ.. ప్లేఆఫ్స్ వైపు అడుగులేసిన చెన్నై 

అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. "క్యాచ్‌ని వదులుకోవడం వల్లే నష్టపోయాం. బెంగ‌ళూరు 150 పరుగులకే పరిమితమయ్యే అవకాశం ఉంది. పవర్‌ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు మ్యాచ్‌లో ఎల్లప్పుడూ ఛేజింగ్‌గా ఉంటారు. 160-170 పరుగులు పోటీ స్కోరుగా ఉండేది. పిచ్ నుంచి కొన్ని బంతులు అడపాదడపా వస్తున్నాయి. కొన్ని బంతులు వేగంగా వస్తుండగా మరికొన్ని ఆగిపోయాయి. మీ ప్రధాన ఆటగాళ్ళు రనౌట్ అయినప్పుడు, వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డంతో మ్యాచ్ పై ప్ర‌భావం ప‌డింది. వ‌రుస క్యాచ్ ల‌ను వ‌ద‌లివేయ‌డంతో పాటు బ్యాటింగ్ లో మా ప్లేయ‌ర్లు రాణించ‌క‌పోవ‌డంతో ఓడిపోయామ‌ని" చెప్పాడు.

జ‌డ్డుభాయ్ ఇదేందయ్యా.. ఔట్ కాకుండా మ‌స్తు ప్లానేసిండు కానీ..

click me!