జ‌డ్డుభాయ్ ఇదేందయ్యా.. ఔట్ కాకుండా మ‌స్తు ప్లానేసిండు కానీ..

By Mahesh Rajamoni  |  First Published May 13, 2024, 8:00 AM IST

Ravindra Jadeja : ఐపీఎల్ 2024లో 61వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి అనూహ్యంగా ఔట్ కావ‌డం వైర‌ల్ గా మారింది.
 


Ravindra Jadeja out : ఐపీఎల్ 2024 లో 61వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ త‌ల‌పడ్డాయి. ఈ మ్యాచ్ లో రాజ‌స్థాన్ పై చెన్నై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ బాగా బ్యాటింగ్ చేసి 35 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సిమర్‌జీత్ సింగ్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలో 145 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో ఆర్ఆర్ పై విజయం సాధించింది.

142 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెన‌ర్లు శుభారంభం అందించారు. 27 పరుగులకు ర‌చిన్ రవీంద్ర అశ్విన్‌కు చిక్కాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా వికెట్లు ప‌డుతున్న క్ర‌మంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజ‌యాన్ని అందించాడు. రుతురాజ్ 42 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ (22 పరుగులు), మొయిన్ అలీ (10 పరుగులు), శివమ్ దూబే (18 పరుగులు), రవీంద్ర జడేజా (5 పరుగులు) పెద్ద ఇన్నింగ్స్ లు ఆడ‌లేక‌పోయారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన సమీర్ రిజ్వీ 8 బంతుల్లో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Latest Videos

మరోసారి జడ్డూ భాయ్..

అయితే, ఈ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ఔట్ అయిన తీరు వైర‌ల్ గా మారింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ జ‌డ్డూ భాయ్ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచాడు. రన్ అవుట్‌కు ప్రయత్నించిన సమయంలో బంతిని స్టంప్‌లను తాకకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు నిర్ధారించబడిన తర్వాత ఫీల్డ్‌ను అడ్డుకున్నందుకు జ‌డేజ అనూహ్యంగా ఔట్ అయ్యాడు.

ల‌క్నో కెప్టెన్సీ నుంచి కేఎల్ రాహుల్ ఔట్.. ఐపీఎల్ కు గుడ్‌బై చెప్పిన‌ట్టేనా? 

16వ ఓవర్‌లో ఈ నాటకీయ ఘటన జరిగింది. అవేష్ ఖాన్ నుండి థర్డ్ మ్యాన్ వైపు జడేజా షార్ట్ డెలివరీని గ్లైడ్ చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కాల్‌కు స్పందించని రుతురాజ్ గైక్వాడ్ అతన్ని వెనక్కి పంపాడు. సంజూ శాంసన్ త్రోను సేకరించి, మరొక ఎండ్‌లోకి విసిరాడు. దానిని జ‌డేజా వెనుకవైపు నుంచి అడ్డుకున్నాడు. కావాల‌నే ర‌నౌట్ కాకుండా జ‌డ్డూ ఇలా చేశాడ‌ని రాజ‌స్థాన్ అంపైర్ కు అప్పీల్ చేసింది. బంతి ఎక్కడ ఉందో జడేజాకు తెలుసని పేర్కొంటూ థర్డ్ అంపైర్ ఔట్ గా ప్ర‌క‌టించాడు.

 

Jaldi wahan se hatna tha 🫨 pic.twitter.com/Op4HOISTdV

— JioCinema (@JioCinema)

ఫీల్డ్‌ను అడ్డుకున్నందుకు ఆల్ రౌండర్‌ను ఔట్ చేశారు. థర్డ్ అంపైర్ క్రికెట్ చట్టాలలోని 37.1 నిబంధన ప్ర‌కారం ఔట్ గా ప్ర‌క‌టించాడు. అయితే, జడేజా ఈ నిర్ణయంపై అసంతృప్తిని వ్య‌క్తంచేశాడు. ఎందుకంటే బంతి ప్రమాదవశాత్తూ తన వీపును తాకిందనీ, దానిని ఆపడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం కాదని పేర్కొన్నాడు. పెవిలియ‌న్ కు చేరేముందు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.

DC VS RCB : క్యాచులు వ‌దిలారు.. మ్యాచ్ ఓడిపోయారు.. ఢిల్లీ పై బెంగ‌ళూరు గెలుపు

click me!