Rajasthan Royals : వరుస విజయాలతో దుమ్మురేపుతున్న రాజస్థాన్ రాయల్స్.. తన నాల్గో మ్యాచ్ లో ఆర్సీబీని చిత్తుగా ఓడించి పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది. అయితే, జోరుమీదున్న సంజూశాంసన్ టీమ్ కు బ్యాడ్ న్యూస్ అందింది.
IPL 2024 - Rajasthan Royals : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం అదిరింది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో ఓటమి లేకుండా ముందుకు సాగుతోంది. ఆడిన 4 మ్యాచ్ లలో గెలిచి 8 పాయింట్లతో టాప్ లో ఉంది. అయితే, జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. మంచి ఫామ్ లో ఉన్న స్టార్ ప్లేయర్ జట్టకు దూరమయ్యాడు. అతనే సందీప్ శర్మ.
రాజస్థాన్ రాయల్స్ మీడియం పేసర్ సందీప్ శర్మ ఐపీఎల్ 2024 సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. రాయల్స్ తదుపరి మ్యాచ్‌కి కూడా సందీప్ దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్ 10న జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ సీజన్‌లో అత్యంత నైపుణ్యంగా ఉపయోగించిన పేసర్లలో సందీప్ శర్మ ఒకరు.
undefined
విరాట్ కోహ్లీ సెంచరీ కొంపముంచింది !
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి గేమ్‌లో కీలక వికెట్ తీసిన సందీప్ మూడు ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐదో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సందీప్ శర్మ ఆడకపోవచ్చు. రాజస్థాన్ కో-ట్రైనర్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ఈ విషయాన్ని వెల్లడించారు.సందీప్ శర్మకు స్వల్ప గాయమైందని తెలిపాడు.
ఈ కమ్రంలోనే ప్రస్తుతం అతను వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడనీ, తదుపరి మ్యాచ్‌లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఆటగాడు ఫిట్‌నెస్‌ను తిరిగి పొందేందుకు చూస్తున్నాడని తెలిపాడు. ప్రతి జట్టుకు గాయాల సమస్యలు ఉన్నాయనీ, జట్టును ఫిట్‌గా ఉంచుకోవడం పెద్ద సవాలుగా ఉందని తెలిపాడు. అయితే, జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి సందీప్ త్వరలో రానున్నారు. దీంతో జట్టు బౌలింగ్ బలం పెరుగుతుందని షేన్ బాండ్ తెలిపాడు.
బాక్సాఫీస్ బద్దలైంది... దుమ్ముదులిపేస్తూ 8వ సెంచరీ కొట్టిన కింగ్ కోహ్లీ !