RCB vs RR Highlights : సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. మరోసారి సంజూ శాంసన్, బట్లర్ సూపర్ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాల్గో విజయాన్ని అందుకుంది.
RCB vs RR Highlights : సంజూ శాంసన్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. జోస్ బట్లర్ సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో ఐపీఎల్ 2024 19వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ సీజన్ లో వరుసగా నాల్గో విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లోకి చేరుకుంది. గత సీజన్‌లో బెంగళూరుతో సొంత గ్రౌండ్ లో 112 పరుగులతో ఘోర పరాజయాన్ని చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు అదే ప్లేస్ లో ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకుంది.
జోస్ బట్లర్ సూపర్ సెంచరీ.. సంజూ హాఫ్ సెంచరీ
undefined
జైపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మొదటి నుంచి బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్, స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ లు దుమ్మురేపే షాట్స్ తో అదరగొట్టారు. దీంతో ఆర్సీబీ చేసిన 183 పరుగులను రాజస్థాన్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల నష్టానికి అధిగమించింది. సంజూ శాంసన్ 42 బంతుల్లో 69 పరుగులతో హాఫ్ సెంచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. సంజూ ఔట్ అయిన తర్వాత బట్లర్ ఆర్ఆర్ కు గెలుపును అందించే బాధ్యతను తీసుకున్నాడు. చివరివరకు క్రీజులో ఉండి రాజస్థాన్ ను సూపర్ విక్టరీ అందించాడు. సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు తన సెంచరీని కూడా పూర్తి చేశాడు. ఐపీఎల్ 2024లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇదే మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ తో ఆర్సీబీ సార్ట్ కింగ్ కోహ్లీ సెంచరీ (113*) తో అదరగొట్టాడు. బట్లర్ 58 బంతుల్లో 100* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
A 💯 to remember for Jos Buttler as he wins the Player of the Award in his 100th IPL game 🏆
Scorecard ▶️ https://t.co/IqTifedScU | pic.twitter.com/bsXpF3zt8W
ఐపీఎల్ 2024లో తొలి సెంచరీ.. విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షో..
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో వన్ మ్యాన్ షో చూపించాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 113* నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఎనిమిదో సెంచరీని కొట్టాడు. మరో ఎండ్ లో ఫాఫ్ డుప్లెసిస్ కూడా మంచి నాక్ ఆడాడు. తొలి వికెట్‌కు విరాట్ కోహ్లి-ఫాఫ్ డు ప్లెసిస్ 13.6 ఓవర్లలో 125 పరుగుల భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పారు. ఫాఫ్ 33 బంతుల్లో 44 పరుగులతో ఔటయ్యాడు. తొలి రెండు ఓవర్లలో 26 పరుగులిచ్చిన పేసర్ ఆండ్రీ బెర్గర్ చివరి రెండు ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
For the second time this season, the run machine remains unbeaten, and true to his name 🙌 pic.twitter.com/gQaOnlcttc
— Royal Challengers Bengaluru (@RCBTweets)తుస్సుమన్న గ్లెన్ మ్యాక్స్ వెల్.. జైస్వాల్
ఆర్సీబీ స్టార్ గ్లెన్ మ్యాక్స్ వెల్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 3 బంతులు మాత్రేమే ఎదుర్కొని ఒక పరుగు చేసి క్లీన్ బౌల్డ్ తో పెవిలియన్ కు చేరాడు. అరంగేట్రం ఆటగాడు సౌరవ్ చౌహాన్ 6 బంతుల్లో 9 పరుగులకే మాత్రమే చేశాడు. ఇక యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ మరోసారి పెద్దగా పరుగులు చేయకుండానే ఔట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ రెండో బంతికి ఓపెనర్ యశస్వి జైస్వాల్ 2 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయడకుండానే ఔట్ అయ్యాడు. ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్, కెప్టెన్ సంజూ శాంసన్ 11వ ఓవర్‌లో రాజస్థాన్‌ను 100 దాటించారు. బట్లర్ 30 బంతుల్లో, సంజు 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు.
Yashasvi Jaiswal In IPL 2024 So Far :- 24, 5, 10, 0.
There Is No Form At All, If This Continues Then What Do You Think About Whether BCCI Should Include Yashasvi Jaiswal In The T20 World Cup Squad Or Not? pic.twitter.com/SNXSJO4ZPV
బాక్సాఫీస్ బద్దలైంది... దుమ్ముదులిపేస్తూ 8వ సెంచరీ కొట్టిన కింగ్ కోహ్లీ !