IPL 2024 Auction LIVE: దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో పలువురు ప్లేయర్లకు రికార్డు ధర పెట్టిన ఫ్రాంఛైజీలు.. కొంతమంది ప్లేయర్లను పెద్దగా పట్టించుకోలేదు. వారిలో మనీశ్ పాండే, స్టీవ్ స్మిత్, కరుణ్ నాయర్ వంటి స్టార్లు ఉన్నారు.
IPL 2024 Auction LIVE updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. కొంతమంది ప్లేయర్లు రికార్డు ధరను దక్కించుకున్నారు. చాలా తక్కువ బేస్ ధరలో ఉన్న ప్లేయర్లకు కోట్ల రూపాయలు చెల్లించిన ఐపీఎల్ టీంలు.. కొంత మంది ప్లేయర్ల వైపు చూపుకూడా చూడలేదు. ఇలా అమ్ముడు పోని వారిలో స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. కరుణ్ నాయర్,మనీష్ పాండే, ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దుబాయ్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం మొదటి రౌండ్‌లో అమ్ముడుపోలేదు.
నాయర్ బేస్ ధర రూ. 50 లక్షలు కాగా, అతను ఐపీఎల్ 2024 వేలంలో అమ్ముడుపోలేదు. 2023 సీజన్‌లో నాయర్ రాజస్థాన్ ఫ్రాంచైజీలో ఒక భాగంగా ఉన్నారు. ఈ 32 ఏళ్ల ప్లేయర్ 76 ఐపీఎల్ మ్యాచ్ లను ఆడాడు. 1496 పరుగులు చేశాడు. ఈ వేలంలో అమ్ముడు పోని మరో స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్. ఆస్ట్రేలియన్ బ్యాటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్ 2024 వేలంలో అమ్ముడుపోలేదు. స్మిత్ బేస్ ధర రూ. 2 కోట్లు అయినప్పటికీ ఏ ఫ్రాంచైజీ బిడ్ చేయలేదు. స్మిత్ తన చివరి ఐపీఎల్ గేమ్‌ను 2021లో ఆడాడు. ఐపీఎల్‌లో 103 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ ప్లేయర్ 2485 పరుగులు చేశాడు.
undefined
అలాగే, భారత బ్యాటర్ మనీష్ కూడా ఐపీఎల్ 2024 మొదటి రౌండ్‌లో అమ్ముడుపోలేదు. మనీష్ ప్రాథమిక ధర రూ. 50 లక్షలు. 2023 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ టీంలో ఉన్నాడు. మనీష్ తన కెరీర్‌లో 170 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 120.97 స్ట్రైక్ రేట్‌తో 3808 పరుగులు చేశాడు.
ఇదే టైమ్ లో పలువురు ప్లేయర్లు కొత్త రికార్డు ధరలు పలికారు. వారిలో మిచెల్ స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లతో దక్కించుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం. అలాగే, పాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ రూ.20.5 కోట్లతో దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో రెండు అత్యంత కఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు.
IPL: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన టాప్-10 ప్లేయర్స్ ..
IPL 2024 Auction: మిచెల్ స్టార్క్ దెబ్బ.. ఐపీఎల్ అబ్బ.. అత్యంత ఖరీదైన ప్లేయర్ ఇతనే..