IPL 2023 SRH vs LSG: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... చావోరేవో తేలిపోవాల్సిందే...

Published : May 13, 2023, 03:04 PM ISTUpdated : May 13, 2023, 03:14 PM IST
IPL 2023 SRH vs LSG: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... చావోరేవో తేలిపోవాల్సిందే...

సారాంశం

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్... ప్లేఆఫ్స్  రేసులో గెలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఇరు జట్లు.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.  


ఇరు జట్ల మధ్య లక్నోలో జరిగిన మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 121 పరుగులు చేస్తే ఈ లక్ష్యాన్ని లక్నో, 16 ఓవర్లలో ఛేదించింది..

లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ రివెంజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ఇరు జట్లకు చాలా కీలకం. ముఖ్యంగా 10 మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నేటి మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది..

నేటి మ్యాచ్‌లో గెలిచి, మిగిలిన మూడు మ్యాచుల్లో కూడా విజయాలు అందుకుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉంటాయి. వర్షం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దు కావడంతో 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్... నేటి మ్యాచ్‌లో గెలిచి, మిగిలిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది..

అయితే కెఎల్ రాహుల్ గాయం కారణంగా టీమ్‌కి దూరం కావడం, లక్నో టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపించింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 257 పరుగుల భారీ స్కోరు చేసి రికార్డు కొట్టిన తర్వాత ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 127 పరుగులను ఛేదించలేకపోయింది లక్నో సూపర్ జెయింట్స్..

వర్షం కారణంగా చెన్నైతో మ్యాచ్‌లో ఒక్క మ్యాచ్ సాధించగలిగింది కానీ ఆ మ్యాచ్ జరిగి ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే అస్సాం ట్రైన్ ఎక్కి ఉండేది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో ఓడిన తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో కృనాల్ టీమ్... ఈ మ్యాచ్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది..

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్, గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 215 పరుగుల భారీ టార్గెట్‌ని ఛేదించింది. అంతకుముందు కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు చేయలేక చేతులు ఎత్తేసిన సన్‌రైజర్స్, రాయల్స్‌తో మ్యాచ్‌లో మూకుమ్మడిగా రాణించింది.

భారీ లక్ష్యఛేదనలో అన్‌మోల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హెన్రీచ్ క్లాసిన్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్ తలా చేయి వేశారు. బ్యాటింగ్‌కి వచ్చిన వారిలో కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ ఒక్కడే ఫెయిల్ అయ్యాడు...
 

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యష్ ఠాకూర్, రవి భిష్ణోయ్, యుద్‌వీర్ సింగ్, ఆవేశ్ ఖాన్ 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హెన్రీచ్ క్లాసిన్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి నటరాజన్, మయాంక్ మర్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హక్ ఫరూకీ

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే