వాంఖెడేలో సూర్యా భాయ్ షో.. ఐపీఎల్‌లో ఫస్ట్ సెంచరీ చేసిన నయా 360.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం..

Published : May 12, 2023, 09:24 PM IST
వాంఖెడేలో సూర్యా భాయ్ షో.. ఐపీఎల్‌లో ఫస్ట్ సెంచరీ చేసిన నయా 360.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం..

సారాంశం

IPL 2023, MI vs GT:  ఐపీఎల్ -16 ప్లేఆఫ్స్ రేసులో కీలక మ్యాచ్ ఆడుతున్న  ముంబై ఇండియన్స్  బ్యాటింగ్ లో రెచ్చిపోయింది.  సూర్యాభాయ్‌ శతకానికి తోడు విష్ణు వినోద్  మెరుపులతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. 

స్వంత గ్రౌండ్ లో ముంబై ఇండియన్స్ మరోసారి రెచ్చిపోయింది.  ఐపీఎల్-16 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన  మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ను  చీల్చి చెండాడింది. నయా 360  సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో103 నాటౌట్, 11 ఫోర్లు, 6 సిక్సర్లు) నాటు కొట్టుడు కొట్టాడు. తన ఐపీఎల్ కెరీర్ లో ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సూర్యకు తోడు ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 31, 4 ఫోర్లు, 1 సిక్స్), విష్ణు వినోద్ (20 బంతుల్లో 30, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)  సంచలన ఇన్నింగ్స్ తో  ఆ జట్టు  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218  పరుగుల భారీ స్కోరు చేసింది.   మరి  బలహీనమైన బౌలింగ్ లైనప్ ఉన్న ముంబై ఈ  స్కోరును డిఫెండ్ చేసుకోగలదా..? అదే జరిగితే ముంబై ప్లేఆఫ్స్ ఆశలు హండ్రెడ్ పర్సెంట్ సజీవంగా  ఉన్నట్టే...!

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి  ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు  మెరుగైన ఆరంభమే ఇచ్చారు.  ఇద్దరూ కలిసి ఫస్ట్ వికెట్ కు  6.1 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు.  ఇటీవల వరుసగా విఫలమవుతున్న రోహిత్.. ఈ మ్యాచ్ లో ఫర్వాలేదనిపించాడు. 

18 బంతులాడిన హిట్‌మ్యాన్.. 2 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 29 పరుగులు చేశాడు. ఇషాన్  కూడా  20 బంతుల్లో  4 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో  31 పరుగులు చేశాడు.  గత మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన   నెహల్ వధేరా.. 7 బంతుల్లో ఓ సిక్స్, ఓ ఫోర్ తో  15 పరుగులు చేసినా   ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. ఓపెనర్లతో పాటు వధేరా వికెట్లు  రషీద్ కే  దక్కాయి. 

సూర్య  - వినోద్ ల జోరు.. 

88కే 3 వికెట్లు కోల్పోయిన ముంబైకి  రన్ రేట్ పడిపోకుండా వికెట్లను కాపాడుకుంటూ   కీలక ఇన్నింగ్స్ ఆడారు  సూర్య, వినోద్‌లు.  అల్జారీ జోసెఫ్ వేసిన  12వ ఓవర్లో  స్క్వేర్ లెగ్ దిశగా  సిక్సర్ కొట్టిన వినోద్.. షమీ వేసిన  13వ ఓవర్లో  4, 6  బాదాడు.  ఇద్దరూ కలిసి ముంబై స్కోరును పరుగులు పెట్టించారు.   15 ఓవర్లకే   ముంబై..  150 పరుగుల స్కోరును దాటింది. 

ముంబై స్కోరు 150 దాటిన తర్వాత  మోహిత్ శర్మ వేసిన 16వ ఓవర్లో  ఆఖరి బంతి ఫుల్ టాస్ రాగా భారీ షాట్ ఆడిన  వినోద్.. అభినవ్ మనోహర్ కు క్యాచ్ ఇచ్చాడు.  ఇక రషీద్ ఖాన్ వేసిన   17వ ఓవర్లో   ఫస్ట్ బాల్ కు ఫోర్ కొట్టిన సూర్య .. మరో అర్థ సెంచరీ (32 బంతుల్లో)ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్ లో  గత ఏడు ఇన్నింగ్స్ లలో సూర్యకు ఇది ఐదో అర్థ సెంచరీ. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి  టిమ్ డేవిడ్ (5) రషీద్ కే స్ట్రెయిట్ క్యాచ్ ఇచ్చి  పెవిలియన్ చేరాడు.  

ఫస్ట్ సెంచరీ..

ఇన్నింగ్స్ చివర్లో సూర్య మరింత రెచ్చిపోయాడు. మోహిత్ శర్మ వేసిన   18వ ఓవర్లో  4, 4, 6, 4తో 20 పరుగులు రాబట్టాడు.  షమీ బౌలింగ్ లో కూడా 6, 4, 4 తో ముంబై స్కోరును  200 దాటించాడు.   దీంతో అతడి  స్కోరు కూడా సెంచరీకి చేరువైంది.  చివరి ఓవర్లో ఫస్ట్ బాల్ కు గ్రీన్ సింగిల్ తీసి  సూర్యకు   స్ట్రైక్ ఇచ్చాడు. రెండో బాల్ కు సూర్య  రెండు పరుగులు తీశాడు.  కానీ మూడో బాల్ కు పరుగులు రాలేదు. నాలుగో బాల్ కు  సిక్స్  కొట్టి 95 కు చేరుకున్నాడు. ఐదో బాల్‌కు  రెండు పరుగులే వచ్చాయి.   లాస్ట్ బాల్ కు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఐపీఎల్ లో సూర్యకు ఇదే ఫస్ట్ సెంచరీ.  

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !