కోహ్లీ మరో అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో రికార్డులు బ్రేక్ చేస్తున్న ఛేజ్ మాస్టర్

Published : Apr 20, 2023, 06:03 PM IST
కోహ్లీ  మరో అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో  రికార్డులు బ్రేక్ చేస్తున్న ఛేజ్ మాస్టర్

సారాంశం

IPL 2023: టీమిండియా  మాజీ సారథి,  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ   ఐపీఎల్ లో  మరో అరుదైన ఘనతను అందుకున్నాడు.  

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ  గత ఐపీఎల్ లో   విఫలమైనా  ప్రస్తుత సీజన్ లో మాత్రం దుమ్మురేపుతున్నాడు.  ఇప్పటికే  ఈ సీజన్  లో  నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన రన్ మిషీన్.. ఈ సీజన్ లో మరో ఘనతను అందుకున్నాడు.  ఐపీఎల్ లో   600 బౌండరీలు  బాదిన  రెండో భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు.  

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ.. 47 బంతుల్లో  5 ఫోర్లు, 1 సిక్సర్ తో 59 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ కు ముందు   ఐపీఎల్ లో 599 బౌండరీలు సాధించగా.. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బౌండరీ సాధించగానే అతడు 600 బౌండరీలు అందుకున్న రెండో బ్యాటర్ గా  నిలిచాడు. 

కాగా ఐపీఎల్  లో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాడిగా శిఖర్ దావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ధావన్..  210 మ్యాచ్ లలో 209 ఇన్నింగ్స్ ఆడి 730  బౌండరీలతో  ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.   ధావన్ తర్వాత వార్నర్.. 608   బౌండరీలతో రెండో స్థానంలో నిలిచాడు.   

 

అయితే  ఐపీఎల్ లో అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో మాత్రం కోహ్లీదే అగ్రస్థానం.  ఇప్పటివరకు  కోహ్లీ.. 229 మ్యాచ్ లలో  221 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి  6,903 పరుగులు చేశాడు.  ఇందులో ఐదు సెంచరీలు,   48 హాఫ్ సెంచరీలున్నాయి.   ఆ తర్వాత జాబితాలో  ధావన్..  210 ఇన్నింగ్స్ లలో  6,477 రన్స్ చేశాడు.   ధావన్ పేరిట  2 సెంచరీలు,  49 హాఫ్ సెంచరీలున్నాయి.  డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో నిలిచాడు.  వార్నర్.. 167 మ్యాచ్ లలోనే  6,109 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో వార్నర్ ఏకంగా  58 హాఫ్ సెంచరీలు,  4 శతకాలు ఉన్నాయి.  రోహిత్ శర్మ..   6,104 రన్స్ తో  నాలుగో స్థానంలో ఉన్నాడు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?