ఏయ్ తొండి.. ఇది ఔట్ కాదు..! నేను వెళ్లను.. జడేజా మాయకు స్టోయినిస్‌కు మతి పోయింది!

Published : May 03, 2023, 06:43 PM ISTUpdated : May 03, 2023, 07:05 PM IST
ఏయ్ తొండి.. ఇది ఔట్ కాదు..!  నేను వెళ్లను..  జడేజా మాయకు  స్టోయినిస్‌కు మతి పోయింది!

సారాంశం

IPL 2023: లక్నో  సూపర్ జెయింట్స్ -  చెన్నై సూపర్ కింగ్స్  మధ్య  లక్నో వేదికగా జరుగుతున్న  మ్యాచ్ లో  జడ్డూ మాయకు స్టోయినిస్ కు దిమ్మ తిరిగింది. 

ఐపీఎల్-16లో భాగంగా   చెన్నై సూపర్ కింగ్స్  - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న  45 వ మ్యాచ్ లో  రవీంద్ర జడేజా మాయ చేశాడు.  ఏడో ఓవర్ వేసిన జడ్డూ.. ఆ ఓవర్లో  ఐదో బంతికి స్టోయినిస్‌ను ఔట్ చేశాడు.  సాధారణంగా అయితే ఇదేమీ గొప్ప విషయం కాదు. కానీ ఇక్కడే జడ్డూ తన టాలెంట్ చూపెట్టాడు.  స్పిన్ కు అనుకూలించే లక్నో పిచ్ లో తన బంతిని గింగిరాలు తిప్పాడు.  ఎంతలా అంటే  మార్కస్ స్టోయినిస్ కండ్లు బైర్లు గమ్మేంతగా..!

లక్నో ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన  జడ్డూ.. ఐదో బంతిని లెగ్ స్టంప్ దిశగా వేశాడు. స్టోయినిస్ దానిని  లెగ్ సైడ్ దిశగా  ఆడదామని   యత్నించాడు.  కానీ   బంతి  అనూహ్యంగా టర్న్ తీసుకుని  ఆఫ్ సైడ్  వికెట్ ను తాకింది.  ధోనితో పాటు రవీంద్ర జడేజా సంబురాల్లో మునిగిపోయారు. 

 

అయితే వాళ్లు సంబురాలు చేసుకుంటున్నా స్టోయినిస్ కు ఏం జరిగిందో అర్థం కాలేదు. వెనక్కి తిరిగి వికెట్లను చూసుకున్నాడు. వికెట్ల మీద బెయిల్స్ లేవు. ‘ఏంటి నేను ఔటయ్యానా..?, స్టంప్ అవుట్ అయి ఉంటదిలే..’అనుకుని నాన్  స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న కరణ్ శర్మ వైపునకు చూశాడు.   డీఆర్ఎస్ ఇవ్వనా అన్నట్టుగా బ్యాట్  పైకి లేపడానికి యత్నించాడు. కానీ కరణ్ శర్మ బౌల్డ్ అయిందని చెప్పగానే బిత్తిరి చూపులు చూస్తూ.. ‘అలా ఎలా అవుట్ అయితా..’ అనుకుంటూ బిత్తిరిచూపులు చూస్తూ డగౌట్ వైపునకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

 

 కాగా లక్నో - చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్ లో  వర్షం వల్ల  మ్యాచ్ నిలిచే సమయానికి లక్నో.. 19.2 ఓవర్లలో  ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అయూష్ బదోని  (33 బంతుల్లో  59 నాటౌట్, 2 ఫోర్లు,  4 సిక్సర్లు)  ఒక్కడే రాణించాడు. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !