IPL 2023, LSG vs CSK: లక్నోకు గాయాల బెడద.. గెలుపు బాట పట్టాలని చెన్నై.. టాస్ గెలిచిన ధోని

By Srinivas MFirst Published May 3, 2023, 3:37 PM IST
Highlights

IPL 2023, LSG vs CSK: లక్నో వేదికగా  లక్నో సూపర్ జెయింట్స్ -  చెన్నై సూపర్ కింగ్స్  మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సీఎస్కే  టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. 

వర్షం వల్ల  అరగంట ఆలస్యమైన  లక్నో సూపర్ జెయింట్స్ -  చెన్నై సూపర్ కింగ్స్  మ్యాచ్ లో సీఎస్కే టాస్ గెలిచి  మొదట బౌలింగ్ ఎంచుకుంది.  లక్నో ఫస్ట్ బ్యాటింగ్ కు రానుంది.  గత మ్యాచ్ లో గాయపడ్డ  కెఎల్ రాహుల్ నేటి మ్యాచ్ లో ఆడటం లేదు. దీంతో ఈ మ్యాచ్ కు  కృనాల్ పాండ్యా లక్నో  సారథ్య పగ్గాలు మోయనున్నాడు. 

రెండ్రోజుల క్రితం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో  ముగిసిన  లో స్కోరింగ్ థ్రిల్లర్ లో ఓడిన  లక్నో సూపర్ జెయింట్స్  నేడు మరోమారు  స్వంత గ్రౌండ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. లక్నోలోని  అటల్ బిహారి వాజ్‌పేయి  ఏకనా స్టేడియంలో లక్నో  సూపర్ జెయింట్స్.. చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొంటున్నది. 

Latest Videos

ఈ సీజన్ లో భాగంగా మే 3 నాటికి ఉన్న పాయింట్ల పట్టికలో   లక్నో, చెన్నైలు  9 మ్యాచ్ లు ఆడి ఐదు గెలిచి నాలుగింటిలో ఓడి   పది పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.  చెన్నై నెట్ రన్ రేట్ కంటే  లక్నో..  కాస్త మెరుగ్గా ఉంది. 

లక్నో పిచ్  స్లో టర్నర్. ఇది స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. ఈ పిచ్ పై బ్యాటర్లు పరుగులు చేయడం కష్టం. గుజరాత్ - లక్నో మ్యాచ్ లో  హార్ధిక్ పాండ్యా సేన  136 పరుగులే చేసి విజయాన్ని సాధించింది. మొన్నటికి మొన్న   ఆర్సీబీ కూడా  125 మాత్రమే కొట్టి  విజయాన్ని అందుకుంది.  గత రెండు మ్యాచ్ లలో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  జట్టు ఇక్కడ గెలిచింది.  మరి  రవీంద్ర జడేజా, మహీశ్ తీక్షణ, మోయిన్ అలీ వంటి స్పిన్నర్లు ఉన్న  చెన్నై..  ఈ పిచ్ ను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిన చెన్నై తిరిగి విజయాల బాట పట్టాలని భావిస్తున్నది. 

 

🚨 Toss Update 🚨 win the toss and elect to field first against .

Follow the match ▶️ https://t.co/QwaagO40CB | pic.twitter.com/pQC9m9fns4

— IndianPremierLeague (@IPL)

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ను గాయాలు వేధిస్తున్నాయి. గత మ్యాచ్ లో గాయం కారణంగా కెఎల్ రాహుల్ ఇవాళ బెంచ్ కే పరిమితమయ్యాడు. మిగతా పిచ్ ల మీద   బాగా ఆడుతున్న  లక్నో బ్యాటర్లు.. స్వంత పిచ్ లో మాత్రం తేలిపోతున్నారు. కైల్ మేయర్స్, బదోని, స్టోయినిస్, పూరన్ వంటి బ్యాటర్లు ఉన్నా  ఛేదనలో 130  స్కోరు చేయలేక తంటాలు పడుతున్నారు.  నేటి మ్యాచ్ లో కూడా ఇదే వైఫల్యం  రిపీట్ అయితే  ఆ జట్టు  పాయింట్ల పట్టికలో టాప్ - 4 లో ప్లేస్ కోల్పోయే ప్రమాదముంది. 

తుది జట్టు : 

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే,  శివమ్ దూబే, అజింక్యా రహానే,  మోయిన్ అలీ,  రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), మహీశ్ తీక్షణ, మతీశ పతిరాన,  తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్ 

లక్నో సూపర్ జెయింట్స్:  కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, కరన్ శర్మ, అయూష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్

click me!