IPL 2023: అదరగొట్టిన బౌలర్లు, ఇక బ్యాటర్లపైనే భారం... సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు...

Published : May 04, 2023, 09:14 PM ISTUpdated : May 04, 2023, 09:21 PM IST
IPL 2023: అదరగొట్టిన బౌలర్లు, ఇక బ్యాటర్లపైనే భారం... సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు...

సారాంశం

IPL 2023: 46 పరుగులు చేసిన రింకూ సింగ్, 42 పరుగులు చేసిన కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా... రెండేసి వికెట్లు తీసిన టి నటరాజన్, మార్కో జాన్సెన్.. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్ ఇచ్చినా బ్యాటింగ్‌కి అద్భుతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించి, కేకేఆర్‌ బ్యాటర్లను కట్టడి చేసినా... సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపైనే భారం పడింది. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి శుభారంభం దక్కలేదు. మొదటి ఓవర్‌లో జాసన్ రాయ్ రెండు ఫోర్లు బాదాడు. అయితే రెండో ఓవర్ తొలి బంతికే రెహ్మనుల్లా గుర్భాజ్ డకౌట్ అయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో హారీ బ్రూక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు గుర్భాజ్..

4 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ కూడా అదే ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ క్లాసిన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా నైట్ రైడర్స్. 19 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన జాసన్ రాయ్, కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. ఈ దశలో నితీశ్ రాణా, రింకూ సింగ్ కలిసి నాలుగో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసిన కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా, అయిడిన్ మార్క్‌రమ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

15 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్, మయాంక్ మర్కండే బౌలింగ్‌లో నటరాజన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్న సునీల్ నరైన్, తన పేలవ ఫామ్‌ని కొనసాగించాడు. 2 బంతుల్లో 1 పరుగు చేసిన సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..


వస్తూనే ఫోర్ బాదిన శార్దూల్ ఠాకూర్, టి నటరాజన్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన రింకూ సింగ్, నటరాజన్ వేసిన ఆఖరి ఓవర్‌లో అబ్దుల్ సమద్ పట్టన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు..

హర్షిత్ రాణా పరుగులేమీ చేయకుండానే నటరాజన్ వేసిన డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 3 పరుగులే ఇచ్చిన నటరాజన్, 2 వికెట్లు (అందులో ఒకటి రనౌట్) తీశాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో టి నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, అడియిన్ మార్క్‌రమ్, మయాంక్ మర్కండే తలా ఓ వికెట్ తీశారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 145 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 7 పరుగుల తేడాతో ఓడింది. దీంతో నేటి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది మ్యాచ్ రిజల్ట్‌ని డిసైడ్ చేయనుంది.

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !