ఒకే ఓవర్‌లో 36 కాదు, 46 పరుగులు... వీడెవడో హర్షల్ పటేల్‌కి అన్నలా ఉన్నాడే!...

By Chinthakindhi RamuFirst Published May 4, 2023, 4:45 PM IST
Highlights

కువైట్‌లో కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో వింత రికార్డు... ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు, రెండు ఫోర్లతో 46 పరుగులు సమర్పించిన బౌలర్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో 200+ స్కోర్లను ఈజీగా ఛేదించేస్తున్నాయి ఫ్రాంఛైజీలు. ఫైవ్ టైమ్ ముంబై ఇండియన్స్, వరుసగా నాలుగు మ్యాచుల్లో 200+ పరుగుల స్కోరును సమర్పించింది. వరుసగా రెండు మ్యాచుల్లో 200+ టార్గెట్‌ని ఈజీగా ఛేదించేసింది...

అంతకుముందు మ్యాచ్‌లో మిడిల్ వికెట్లను విరగొట్టిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఈసారి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వీర కొట్టుడు కొట్టాడు. ముంబై బ్యాటర్ల వీర బాదుడు కారణంగా అర్ష్‌దీప్ సింగ్, 3.5 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు సమర్పించి చెత్త రికార్డు క్రియేట్ చేశాడు..

అంతకుముందు జోఫ్రా ఆర్చర్ కూడా  4 ఓవర్లలో 56 పరుగులు సమర్పించాడు. అయితే ఓ బౌలర్‌ ఏకంగా ఒకే ఓవర్‌లో 46 పరుగులు సమర్పించేశాడు. ఓవర్‌‌‌లో ఉండే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన వచ్చేది 36 పరుగులే మరి 46 పరుగులు ఎలా సాధ్యమయ్యాయి..

కువైట్‌లో కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో ఈ వింత రికార్డు నమోదైంది. ఎన్‌సీఎం ఇన్వెస్ట్‌మెంట్స్ వర్సెస్ టాలీ సీసీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎన్‌సీఎం బ్యాటర్ వాసు, ట్యాలీ టీమ్‌కి చెందిన హర్మన్ బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించాడు...

హర్మన్‌ వేసిన మొదటి బంతికి వాసు సిక్సర్ బాదాడు. అయితే అది నో బాల్ కావడంతో ఆ తర్వాతి బంతికి బౌస్ రూపంలో మరో 4 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదాడు వాసు. అందులో మరో నో బాల్ రావడంతో దాన్ని ఫోర్‌ కొట్టాడు. మొత్తంగా ఆరు సిక్సర్లు, రెండు ఫోర్లతో పాటు నో బాల్స్ రూపంలో మరో 2 పరుగులు అదనంగా వచ్చాయి...

Getting 46 runs in an over is not possible right? Right? Wrong! Watch this absolute bonkers over now.
.
. pic.twitter.com/PFRRivh0Ae

— FanCode (@FanCode)

ఒకే ఓవర్‌లో 46 పరుగులు సమర్పించేసిన హర్మన్‌, 2 ఓవర్లలో 68 పరుగులు సమర్పించేశాడు. ఈ ఓవర్‌కి ముందు 20 బంతుల్లో 19 పరుగులే చేసిన వాసు, ఓవర్ ముగిసే సమయానికి 26 బంతుల్లో 49 పరుగులకు చేరుకున్నాడు..

ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్‌గా ఉన్నాడు హర్షల్ పటేల్. 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌, రవీంద్ర జడేజా 5 సిక్సర్లు, ఓ ఫోర్‌, ఓ రెండు పరుగులు బాది 37 పరుగులు రాబట్టాడు. ఎక్స్‌ట్రాల రూపంలో మరో పరుగు వచ్చింది.

అంతకుముందు 2011లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో కొచ్చి టస్కర్స్ కేరళ బౌలర్ పీ. పరమేశ్వరన్ కూడా ఒకే ఓవర్‌లో 37 పరుగులు సమర్పించాడు. ఆ రికార్డును 10 ఏళ్ల తర్వాత సమం చేసిన హర్షల్ పటేల్, 2021 సీజన్‌లో 32 వికెట్లు పడగొట్టి, ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డీజే బ్రావో రికార్డును కూడా సమం చేయడం విశేషం.. 

click me!