రాసిపెట్టుకోండి.. ఈసారి కప్ కొట్టేది వాళ్లే అంటున్న వాన్.. నువ్వు చెప్పావంటే కచ్చితంగా గెలవదు..

By Srinivas MFirst Published Mar 30, 2023, 3:51 PM IST
Highlights

IPL 2023: ఐపీఎల్  - 16  ప్రారంభానికి  బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈ లీగ్ లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా మొదలుకాకముందే  విశ్లేషకులు తమ  విశ్లేషణా శక్తికి పదును పెడుతున్నారు. 

నాలుగేండ్ల తర్వాత  ‘హోం అండ్ అవే’ పద్ధతిలో జరుగబోతున్న ఐపీఎల్ ను ఎంజాయ్ చేయడానికి  క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ లీగ్ లో ఇప్పటివరకు ఒక్క బంతి కూడా పడలేదు.  ఒక్క మ్యాచ్  లో ఫలితం తేలకున్నా.. ఎవరు ఎలా ఆడతారో   తెలియకున్నా   విశ్లేషకులు మాత్రం తమ విశ్లేషణా శక్తితో అంచనాలను పెంచేస్తున్నారు.  ఇంగ్లాండ్  మాజీ సారథి మైకేల్ వాన్.. తాజాగా ఐపీఎల్ - 2023 విజేతను   అంచనా వేయడమే గాక వాళ్లే గెలుస్తారని బల్లగుద్ది చెప్పాడు.  

ఐపీఎల్ ప్రారంభానికి ముందు  వాన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఐపీఎల్   ఓపెనింగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా.. ఈసారి   నేను క్రిక్ బజ్ టీమ్ తో కలవబోతున్నాను. నాకు తెలిసి ఈసారి  ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచేది  రాజస్తాన్ రాయల్స్ అని బలంగా నమ్ముతున్నా.  ఈసారి మే నెలలో ట్రోఫీని లిఫ్ట్ చేయబోయేది వాళ్లే...’అని  పేర్కొన్నాడు.  

కాగా గతేడాది  రాజస్తాన్ రాయల్స్   జట్టు  అంచనాలకు మించి రాణించింది.    2022 సీజన్ లో నిలకడగా రాణించిన రాజస్తాన్.. ఏకంగా ఫైనల్స్ కు వెళ్లింది.  2008 తర్వాత ఫైనల్స్ కు చేరడం ఆ జట్టుకు అదే తొలిసారి. అయితే ఈసారి కూడా   ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది.  బ్యాటింగ్ లో  జోస్ బట్లర్,  దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్,  జో రూట్, షిమ్రన్ హెట్మెయర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.   ఇక  బౌలింగ్ లో ప్రసిధ్ కృష్ణ గాయంతో వైదొలిగినా  ట్రెంట్ బౌల్ట్,  జేసన్ హోల్డర్, అశ్విన్, చహల్, మురుగన్ అశ్విన్, ఆడమ్ జంపాలతో   ఆ టీమ్ పటిష్టంగానే ఉంది. వాన్ తో పాటు నాలుగు రోజుల క్రితం మహ్మద్ కైఫ్ కూడా ఈసారి  ఐపీఎల్ విజేత రాజస్తానే అని అంచనా వేయడం గమనార్హం. 

 

Can’t wait for the IPL to start .. Looking forward to being part of the team .. I thinks it’s going to be year .. they will be lifting the trophy in late May ..

— Michael Vaughan (@MichaelVaughan)

ఇదిలాఉండగా వాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘నువ్వు ప్రెడిక్ట్ చేశావంటే అది కచ్చితంగా జరుగదు..’, ‘రాజస్తాన్ మంచి జట్టే కానీ  ట్రోఫీ గెలిచేంత సీన్ లేదు. ఈసారి  టోర్నీ విజేత  ముంబై లేదా చెన్నై’అని కొంతమంది అంటుంటడా  సన్ రైజర్స్ ఫ్యాన్స్ మాత్రం  ఈసారి కప్ కొట్టేది మేమే అంటున్నారు. పలువురు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘నువ్వెన్నన్న చెప్పుకో.. ఈసారి కప్ కొట్టేది మేమే..’అని  కామెంట్ చేశాడు. 

 

Abba sai ram eedu annadu antey pakka meedi kaadu le raa

— నితీష్ కుమార్ నిగ్రహ సేన (@mrsiddhaarth26)

ఐపీఎల్ 2023లో రాజస్తాన్ జట్టు : దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, జోస్ బట్లర్, కె.సి. కరియప్ప,  కుల్దీప్ సేన్,  నవదీప్ సైనీ, ఒబెడ్ మెక్‌కాయ్, ఆర్. అశ్విన్, రియాన్ పరాగ్, సంజూ శాంసన్, షిమ్రన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, జేసన్ హోల్డర్, ఫెరీరా, కునాల్ రాథోడ్, ఆడమ్ జంపా, మురుగన్ అశ్విన్, ఆకాశ్ వశిష్ట్, అబ్దుల్ పీఎ, జో రూట్  

click me!