IPL 2023: ‘మార్కుల కోసం ఏడవలేదురా ఏ సైంటిస్టు.. గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రెస్టు’ అన్నాడు సిరివెన్నెల. తాజాగా పదో పరీక్షలు ముంచుకొస్తున్న వేళ కోహ్లీ కూడా విధ్యార్థులకు ఇదే జ్ఞానబోధ చేశాడు.
టీమిండియా మాజీ సారథి, ఛేదనలో మొనగాడు, పరుగుల యంత్రం, కింగ్.. ఇలా ఎన్నో పేర్లు ఉన్న విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్ననాటి నుంచే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న కోహ్లీ.. ఆ దిశగా ఎన్నో కష్టాలకోర్చి సక్సెస్ అయ్యాడు. చదువు కంటే ఆట మీదే ఎక్కువ ఆసక్తి కనబరిచిన కోహ్లీ.. 12వ తరగతి వరకూ చదువుకున్నాడు. తాజాగా తన టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో షేర్ చేశాడు. దేశమంతటా పదో తరగతి పరీక్షల కాలం తరుముకొస్తున్న నేపథ్యంలో కోహ్లీ తన ఎస్ఎస్‌సీ మార్క్స్ షీట్ ను పంచుకోవడం గమనార్హం.
‘మార్కుల కోసం ఏడవలేదురా ఎదిగిన ఏ సైంటిస్టు.. గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రెస్టు’ అన్నాడు సిరివెన్నెల. తాజాగా పదో పరీక్షలు ముంచుకొస్తున్న వేళ కోహ్లీ కూడా విధ్యార్థులకు ఇదే జ్ఞానబోధ చేశాడు. మనకు నచ్చిన రంగంలో శ్రమించగలిగితే ఫలితాలు వాటంతంటే అవే వస్తాయని చెప్పకనే చెప్పాడు.
క్రికెట్ మీద మక్కువ ఉన్నా కోహ్లీ చదువు లో కూడా యావరేజ్ స్టూడెంటే అని అతడి మార్కులు చూస్తూనే తెలుస్తుంది. ఇంగ్లీష్ లో 83 మార్కులు సాధించిన కోహ్లీ.. హిందీలో 75 మార్కులు తెచ్చుకున్నాడు.
It's funny how the things that add the least to your marksheet, add the most to your character.
Class 10th Marksheet of Virat Kohli pic.twitter.com/d48rCObSFx
మ్యాథ్స్ లో 51 మార్క్స్ రాగా.. సైన్స్ లో 55, సోషల్ స్టడీస్ లో 81 మార్కులు వచ్చాయి. ఈ మార్కుల లిస్టును షేర్ చేస్తూ ‘మీ మార్కుల షీట్లలో ప్రాధాన్యమే ఇవ్వని విషయాలు మీ క్యారెక్టర్ బిల్డ్ చేయడంలో ఎంతగానో తోడ్పడుతుండటం ఫన్నీగా ఉంది..’అని రాసుకొచ్చాడు. ఇదే లిస్ట్ లో కోహ్లీ.. స్పోర్ట్స్ అని రాసి ఉన్న కాలమ్ ను ఖాళీగా వదిలేసి ఈ కామెంట్ చేయడం గమనార్హం. కోహ్లీ.. 2004లో ఢిల్లీలోని సేవియర్ కాన్వెంట్ సెకండరీ స్కూల్ లో పదో తరగతి చదివాడు. ఇంటర్ తర్వాత పూర్తిగా క్రికెట్ మీదే దృష్టి సారించాడు.
Fueled by passion, unmatched commitment, and with sheer focus, the GOAT is getting ready for .
Kohli in Do Not Disturb mode! 🚫🔥 pic.twitter.com/3vzfz4z87A
ఇక కోహ్లీ కంటే ముందే 1990, 2000 దశకాల్లో (సుమారు 25 ఏండ్లు) భారత క్రికెట్ కు కర్త, కర్మ, క్రియగా ఉన్న సచిన్ టెండూల్కర్ కూడా పదో తరగతి పాస్ కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. సచిన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తర్వాత చాలా మందికి తమ జీవితంలో వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకునేందుకు ఓ మార్గాన్ని చూపింది. చదువు ముఖ్యమే గానీ చదువుకు కెరీర్ కు సంబంధం లేదని తర్వాత చాలా మంది చాటి చెప్పారు. కోహ్లీ విషయానికొస్తే.. రాబోయే ఐపీఎల్ లో ఆడేందుకు అతడు సిద్ధమవుతున్నాడు.