IPL 2023: వివ్రంత్ విధ్వంసం.. అగర్వాల్ అరాచకం.. ముంబై ముందు భారీ టార్గెట్

Published : May 21, 2023, 05:26 PM IST
IPL 2023: వివ్రంత్ విధ్వంసం.. అగర్వాల్ అరాచకం.. ముంబై ముందు భారీ టార్గెట్

సారాంశం

IPL 2023, MI vs SRH: ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో  ముంబై బౌలర్లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు.   సన్ రైజర్స్ ఓపెనర్లు  వీరబాదుడు బాదారు. 

ప్లేఆఫ్స్ ఆశలు  సన్నగిల్లుతున్న వేళ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  ముంబై బౌలర్లు విఫలమయ్యారు.  సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో  83,  8 ఫోర్లు,  4 సిక్సర్లు), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న వివ్రంత్ శర్మ (47 బంతుల్లో 69, 9 ఫోర్లు, 2 సిక్సర్లు)   వీరబాదుడు బాదడంతో   హైదరాబాద్ భారీ స్కోరు చేసింది.   ఈ ఇ్దదరూ తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించారు.   ఇన్నింగ్స్ చివర్లో హైదరాబాద్ బ్యాటర్లు తడబడటంతో 230 ప్లస్ టార్గెట్  పక్కా అనుకున్న ఈ మ్యాచ్ లో ఎస్ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.  ఈ లక్ష్యాన్ని ముంబై.. 70 బంతులు మిగిలుండగా ఛేదిస్తేనే  ఆర్సీబీ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ వస్తుంది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  సన్ రైజర్స్.. ఈ మ్యాచ్ లో కూడా ఓపెనింగ్ జోడీని మార్చింది.  మయాంక్ అగర్వాల్ కు తోడుగా వివ్రంత్ శర్మ  వచ్చాడు.  ఈ సీజన్ మొత్తం  దారుణంగా విఫలమైన హైదరాబాద్ ఓపెనింగ్ పెయిర్ ప్రయోగం ఈసారి మాత్రం సూపర్ సక్సెస్ అయింది. ఈ ఇద్దరూ కలిసి  13.5 ఓవర్లలోనే  140  పరుగులు జోడించారు.  ఈ సీజన్ లో ఏ వికెట్ కు అయినా హైదరాబాద్ కు ఇదే  హయ్యస్ట్ పార్ట్‌నర్‌షిప్. 

పవర్ ప్లే లో  ఈ ఇద్దరూ  ఒకరికి మించి ఒకరు ముంబై బౌలర్లను ఆటాడుకున్నారు.  ఓవర్ కు రెండు ఫోర్లకు తగ్గకుండా ఈ ఇద్దరి విధ్వంసం సాగింది.  హైదరాబాద్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో తప్ప ఏడో ఓవర్ వరకూ మిగిలిన ప్రతీ ఓవర్లో ఈ ఇద్దరూ బంతిని బౌండరీ లైన్ దాటించారు. క్రిస్ జోర్డాన్ వేసిన  పదో ఓవర్లో   రెండు ఫోర్లు కొట్టిన వివ్రంత్.. ఐదో బాల్ కు సింగిల్ తీసి 36 బంతుల్లోనే  హాఫ్  సెంచరీ చేశాడు. ఈ క్రమంలో అతి పిన్నవయస్సులోనే  ఎస్ఆర్‌హెచ్ తరఫున హాఫ్  సెంచరీ చేసిన ఆటగాళ్లలో  ప్రియమ్ గార్గ్ (19 ఏండ్ల 307 రోజులు), అభిషేక్ శర్మ (21 ఏండ్ల 217 రోజులు) తర్వాత వివ్రంత్ (23 ఏండ్ల  203 రోజులు) నిలిచాడు.  

 

బెహ్రన్‌డార్ఫ్ వేసిన   13వ ఓవర్లో  మయాంక్ కూడా సిక్స్, ఫోర్ కొట్టి   ఈ సీజన్ లో ఫస్ట్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  సన్ రైజర్స్ స్కోరును పరుగులు పెట్టించిన  వివ్రంత్‌ను ఆకాశ్ మధ్వల్  ఎట్టకేలకు  14వ ఓవర్లో ఔట్ చేశాడు. వివ్రంత్ ఔటయ్యాక కూడా   రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టిన  మయాంక్ కూడా మధ్వల్ వేసిన   17వ ఓవర్లో నాలుగో బాల్ కు  వికెట్ కీపర్ ఇషాన్ కిషన్  కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జోర్డాన్ వేసిన  18వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్  (1) ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (18),  హ్యారీ బ్రూక్ (0)  లు విఫలమయ్యారు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని చివర్లో  వికెట్లు ఉన్నా హైదరాబాద్ బ్యాటర్లు  మంచి అవకాశంగా మలుచుకోలేకపోయారు. ముంబై యువ బౌలర్ ఆకాశ్ మధ్వల్ కు నాలుగు వికెట్లు దక్కాయి. 

PREV
click me!

Recommended Stories

ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు
డికాక్ రాకతో డేంజరస్‌గా ముంబై.. ప్లేయింగ్ ఎలెవన్ చూస్తే మతిపోతుంది