గుజరాత్ ఫుడ్ ఇష్టముండి.. తెలుగు మీ అధికారిక భాష అయితే.. సొంత టీమ్‌నే ట్రోల్ చేసుకున్న అశ్విన్

Published : May 21, 2023, 04:04 PM IST
గుజరాత్ ఫుడ్ ఇష్టముండి.. తెలుగు మీ అధికారిక  భాష అయితే.. సొంత టీమ్‌నే ట్రోల్ చేసుకున్న  అశ్విన్

సారాంశం

IPL 2023 Playoffs: ఐపీఎల్ -16 లో నేడు  నాలుగు జట్ల  మధ్య  రెండు కీలక మ్యాచ్ లు జరుగుతున్నా  ప్లేఆఫ్స్ స్పాట్ కోసం  రాజస్తాన్ రాయల్స్ కూడా ఆసక్తికరంగా వేచి చూస్తున్నది. 

ఐపీఎల్ - 16 లో ఓ దశలో  టేబుల్ టాపర్ గా ఉండి   తర్వాత  వరుస వైఫల్యాలతో  ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన (?)   జట్టు రాజస్తాన్ రాయల్స్.   రాజస్తాన్ ఎలమినేట్ అయినట్టు అధికారికంగా  వెలువడనప్పటికీ ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే చాలా అద్భుతాలు  జరగాలి. ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్..  సొంత టీమ్ నే దారుణంగా ట్రోల్ చేసుకున్నాడు. పరోక్షంగా  సన్ రైజర్స్ హైదరాబాద్,  గుజరాత్ టైటాన్స్ కు మద్దతు తెలుపుతూ  అశ్విన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.  

]ముంబై - హైదరాబాద్ మ్యాచ్ కు ముందు అశ్విన్ ట్విటర్ వేదికగా ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటోలో  అశ్విన్ ఏదో చెబుతుండగా  రాజస్తాన్ ఆటగాళ్లంతా ఆసక్తిగా  వింటున్నారు. ఈ ఫోటోకు  అశ్విన్ ఇచ్చిన క్యాప్షన్  కూడా  ఆసక్తికరంగా ఉంది. 

‘గుజరాత్ ఫుడ్ మనకు ఇష్టమైన  ఫుడ్ గా ఉండాలని.. అలాగే తెలుగు భాష మన టీమ్ మాట్లాడే అధికారిక భాష కావాలని  మీరు  అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు..’  అని  ఫన్నీగా రాసుకొచ్చాడు.  ఈ ట్వీట్ లో గుజరాత్ ఫుడ్ ఇష్టం అంటే..  నేడు  రాత్రి  7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ టీమ్..  ఆర్సీబీతో ఆడనుంది. మరోవైపు తెలుగు  లాంగ్వేజ్ టీమ్ అధకారిక భాషగా ఉండాలంటే..  ముంబైతో మ్యాచ్ లో హైదరాబాద్ గెలవాలని  అర్థం వచ్చే విధంగా పరోక్షంగా అశ్విన్  చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 

 

గుజరాత్ -  బెంగళూరు మ్యాచ్ లో గుజరాత్ భారీ తేడాతో  ఆర్సీబీని భారీ   తేడాతో ఓడించి.. హైదరాబాద్, ముంబైకి షాకిస్తే అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా రాజస్తాన్  జట్టు ప్లేఆఫ్స్ కు వెళ్లే అవకాశముంటుంది. అశ్విన్ ట్వీట్ కూడా దానిని ఉద్దేశించినదే.  అశ్విన్ పెట్టిన ఈ ట్వీట్ కింద  పలువురు కామెంట్స్ చేస్తూ.. ‘యాష్ అన్న.. నీ ప్రపోజల్ కు  ఒకడు కన్విన్స్ అయ్యాడు’ అంటూ జో రూట్  ఫోటోను  షేర్ చేస్తున్నారు. 

 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు