IPL 2023 LSG vs GT: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... రాహుల్ జిడ్డు బ్యాటింగ్ మీద నమ్మకంతో...

Published : Apr 22, 2023, 03:07 PM ISTUpdated : Apr 22, 2023, 03:19 PM IST
IPL 2023 LSG vs GT: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... రాహుల్ జిడ్డు బ్యాటింగ్ మీద నమ్మకంతో...

సారాంశం

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్... తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచుల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కి అదిరిపోయే రికార్డు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో టాస్ గెలిచిన తర్వాత మెజారిటీ టీమ్ కెప్టెన్లు తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపారు. ఈ సీజన్‌లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకున్న మూడో సారథిగా నిలిచాడు హార్ధిక్ పాండ్యా... 

లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసిన గత 10 మ్యాచుల్లో 9 మ్యాచుల్లో విజయాలు అందుకుంది. అదే లక్ష్యఛేదనలో మాత్రం తీవ్రంగా తడబడుతోంది. ఈ రికార్డు కారణంగానే టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు హార్ధిక్ పాండ్యా.. 

మొదటి 6 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే టాప్ పొజిషన్‌కి ఎగబాకుతుంది. అలాగే వరుస హ్యాట్రిక్ విజయాలతో సీజన్‌ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో వరుస పరాజయాలు అందుకుంది...

లక్నో సూపర్ జెయింట్స్ తరుపున కైల్ మేయర్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంటే కెఎల్ రాహుల్ కూడా గత రెండు మ్యాచుల్లో పరుగులు సాధించి, ఫామ్ అందుకున్నాడు. మార్క్ వుడ్‌తో పాటు రవి భిష్ణోయ్ అదరగొడుతున్నారు...

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 154 పరుగులే చేసి బ్యాటింగ్‌లో మరీ బ్రహ్మాండమైన స్కోరు చేయకపోయినా బౌలింగ్‌లో అదరగొట్టి 10 పరుగుల తేడాతో గెలిచి అందరికీ షాక్ ఇచ్చింది లక్నో సూపర్ జెయింట్స్... పవర్ ప్లేలో జిడ్డు బ్యాటింగ్‌తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్న కెఎల్ రాహుల్, కేవిన్ పీటర్సన్ వంటి మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు కూడా అందుకున్నాడు...

మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఎక్కువగా శుబ్‌మన్ గిల్‌‌పైనే ఆధారపడుతోంది. సాయి సుదర్శన్ నిలకడైన ప్రదర్శన ఇస్తున్నా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా నుంచి ఇప్పటిదాకా సరైన పర్ఫామెన్స్ రాలేదు. సాహా కారణంగా తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్ ఇప్పటిదాకా సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయాడు..  గత సీజన్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా ఈసారి బ్యాటుతో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు...

సీనియర్ బౌలర్ మహ్మద్ షమీతో పాటు మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, అల్జెరీ జోషఫ్.. ఇలా గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ యూనిట్ పటిష్టంగా ఉంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ కారణంగా ఓడిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అనవసర ప్రయోగాలతో చేతులు కాల్చుకుంది...

గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా టీమ్‌లోకి వచ్చిన నూర్ అహ్మద్‌ని నేటి మ్యాచ్‌లో నేరుగా టీమ్‌లోకి తీసుకుంది గుజరాత్ టైటాన్స్.. 

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, రవి భిష్ణోయ్

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?