కోపంతో ఊగియిన రవీంద్ర జడేజా.. ఎందుకో తెలుసా..?

Published : Apr 22, 2023, 09:25 AM IST
కోపంతో ఊగియిన రవీంద్ర జడేజా.. ఎందుకో తెలుసా..?

సారాంశం

ఈ మ్యాచ్ లో చెన్నై ఆటగాడు జడేజా కోపంతో ఊగిపోయాడు. అతని కోపాన్ని కంట్రోల్ చేయడానికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రంగంలోకి దిగి, శాంతింప చేయడం విశేషం.

ఐపీఎల్ 2023 ఉత్కంఠంగా సాగుతోంది. శుక్రవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ జట్టు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది. అయితే.... ఈ మ్యాచ్ లో చెన్నై ఆటగాడు జడేజా కోపంతో ఊగిపోయాడు. అతని కోపాన్ని కంట్రోల్ చేయడానికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రంగంలోకి దిగి, శాంతింప చేయడం విశేషం.

 

ఇన్నింగ్స్ లో 14వ ఓవర్ లో జడేజా బౌలింగ్ లో తొలి బంతిని తప్పుగా అంచనా వేసిన మయాంక్ అగర్వాల్ రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. దీన్ని అందుకునే ప్రయత్నంలో జడేజాకు నాన్ స్ట్రైకర్ క్లాసెన్ అడ్డుగా వచ్చాడు. ఒకరిని మరొకరు ఢీ కొట్టడంతో జడేజా క్యాచ్ పట్టలేకపోయాడు. వెంటనే క్లాసెన్ క్షమాపణ చెప్పినప్పటికీ జడేజా కోపంతో ఊగిపోయాడు. చూపులతోనే కాసెన్ ని భయపెట్టేశాడు. నోటికి కూడా పని చెప్పాడు. అదే ఓవర్ అయిదో బంతికి స్టంపౌట్ రూపంలో మయాంక్ ను ఔట్ చేసిన జడ్డూ... మరోసారి క్లాసెన్ పై నోరు పారేసుకున్నాడు. దీంతో.. ధోనీ రంగంలో దిగి అతన్ని కూల్ చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరీ  అంత కోపం ఏంటి జడ్డూ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?