బ్లూ టిక్ లేకుంటే, మిమ్మల్ని గుర్తించడమెలా..? సచిన్ కి నెటిజన్ ప్రశ్న..!

Published : Apr 22, 2023, 10:10 AM IST
బ్లూ టిక్ లేకుంటే, మిమ్మల్ని గుర్తించడమెలా..? సచిన్ కి నెటిజన్ ప్రశ్న..!

సారాంశం

నెటిజన్లకు కూడా ఏది రియల్ ఎకౌంట్, ఏది ఫేక్ ఎకౌంట్ అనే విషయం తెలుసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు బ్లూ టిక్ తీసేయడంతో... ఏది రియల్ ఎకౌంటో, ఫేక్ ఎకౌంటో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. 

భారత్ లోని ప్రముఖులందరికీ ట్విట్టర్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రముఖలందరికీ ఉండే బ్లూ టిక్ ని ట్విట్టర్ తొలగించింది. నిజానికి బ్లూ టిక్ అఫీషియల్ ఎకౌంట్స్ కి మాత్రమే ఇస్తారు. దీంతో... నెటిజన్లకు కూడా ఏది రియల్ ఎకౌంట్, ఏది ఫేక్ ఎకౌంట్ అనే విషయం తెలుసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు బ్లూ టిక్ తీసేయడంతో... ఏది రియల్ ఎకౌంటో, ఫేక్ ఎకౌంటో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ఇదే అనుమానాన్నిఓ నెటిజన్ వ్యక్తం చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ని ఇదే ప్రశ్న అడిగాడు.  దానికి సచిన్ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది.


షారూఖ్ ఖాన్ , అమితాబ్ బచ్చన్ వంటి స్టార్‌ల నుండి విరాట్ కోహ్లీ , MS ధోని వంటి క్రికెటర్ల వరకు, మైక్రోబ్లాగింగ్ సైట్‌లో అసలు గుర్తింపుల నిర్ధారణ వంటి వారి పేర్లకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ బ్లూ చెక్‌మార్క్‌లను కోల్పోయారు. వారిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఒకరు. కాగా... ఆయన శుక్రవారం ట్విట్టర్ లో ‘ Ask me anything’ అంటూ తన ఫాలోవర్స్ ని అడిగారు.

 

 "ఇప్పుడు మీ వద్ద బ్లూ టిక్ లేదు, మీరు నిజమైన సచిన్ టెండూల్కర్ అని మేము ఎలా నిర్ధారించగలం?" అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి లెజెండ్ నీలిరంగు టీ-షర్ట్‌లో నవ్వుతున్న చిత్రంతో సమాధానం ఇచ్చాడు. "ఇప్పటికి ఇది నా బ్లూ టిక్ వెరిఫికేషన్" అని క్యాప్షన్‌లో రాశాడు.
 
సచిన్ సరదాగా ఇచ్చిన రిప్లై నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. బలే సమాధానం ఇచ్చారు సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?