సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి గుడ్‌న్యూస్! బీభత్సమైన ఫామ్‌లో అయిడిన్ మార్క్‌రమ్...

Published : Apr 02, 2023, 05:51 PM IST
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి గుడ్‌న్యూస్! బీభత్సమైన ఫామ్‌లో అయిడిన్ మార్క్‌రమ్...

సారాంశం

నెదర్లాండ్‌‌తో మూడో వన్డేలో వన్డే సెంచరీ బాదిన అయిడిన్ మార్క్‌రమ్.. త్వరలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో కలవబోతున్న ఆరెంజ్ ఆర్మీ కొత్త కెప్టెన్.. 

ఐపీఎల్ 2023 సీజన్ మొదలైపోయింది. అయితే ఇంకా సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ ప్లేయర్లు, ఐపీఎల్‌లో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ జరుగుతుంటే, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది.. సాధారణంగా చిన్న చిన్న టీమ్స్‌తో సిరీస్‌లు అంటే సీనియర్లు, స్టార్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి, బీ టీమ్‌తో ఆడిస్తారు. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించేందుకు చివరి అవకాశం కావడంతో సౌతాఫ్రికా అలాంటి రిస్క్ చేయడం లేదు. స్వదేశంలో క్రికెట్ పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో క్వింటన్ డి కాక్‌తో పాటు డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, సిసండ మగల, లుంగి ఇంగిడి, ఆన్రీచ్ నోకియా, హెన్రీచ్ క్లాసీన్, అయిడిన్ మార్క్‌రమ్ వంటి స్టార్ ప్లేయర్లు అందరూ ఆడుతున్నారు...

రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా, జోహన్‌బర్గ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 370 పరుగుల భారీ స్కోరు చేసింది. క్వింటన్ డి కాక్ 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేయగా తెంబ భవుమా 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేశాడు.. 32  పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది సౌతాఫ్రికా..

అయితే రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 40 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు, హెన్రీచ్ క్లాసీన్ 21 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ అవుటైనా అయిడిన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్ కలిసి ఐదో వికెట్‌కి 199 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు..

డేవిడ్ మిల్లర్ 61 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 పరుగులు చేసి అవుట్ కాగా అయిడిన్ మార్క్‌రమ్ 126 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. అయిడిన్ మార్క్‌రమ్‌కి ఇది వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొట్టమొదటి అంతర్జాతీయ టీ20 సెంచరీ బాదిన అయిడిన్ మార్క్‌రమ్, అదే నెలలో టెస్టుల్లో సెంచరీ అందుకున్నాయి. ఏప్రిల్‌లో వన్డేల్లో మొట్టమొదటి సెంచర నమోదు చేశాడు. మూడు నెలల గ్యాప్‌లో మూడు ఫార్మాట్లలోనూ శతకాలు నమోదు చేశాడు అయిడిన్ మార్క్‌రమ్.

మార్కో జాన్సెన్ 11, సిసండ మగల 5, అన్రీచ్ నోకియా 5 పరుగులు చేశారు. ఈ మధ్య కాలంలో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న అయిడిన్ మార్క్‌రమ్, కెప్టెన్‌గా సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్‌కి టైటిల్ అందించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆడని అయిడిన్ మార్క్‌రమ్, ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలో దిగబోతున్నాడు.. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?