ముద్దులన్ని మూటగట్టి నీకు పంపినా.. ఎంత పనైపాయే కోహ్లీ భాయ్..!

By Srinivas MFirst Published May 22, 2023, 1:04 PM IST
Highlights

IPL 2023: ఐపీఎల్  లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి  కప్ గెలిచే  అదృష్టం లేనట్టే ఉంది. అతడు ఎంత బాగా ఆడుతున్నా టీమ్ మాత్రం దారుణంగానే విఫలమవుతూనే ఉన్నది. 

వరుసగా రెండు సెంచరీలు చేసి ఐపీఎల్ లో  క్రిస్ గేల్ పేరిట ఉన్న ఆరు సెంచరీల రికార్డును బ్రేక్  చేశాడు విరాట్ కోహ్లీ.  గుజరాత్ టైటాన్స్ తో  నిన్న రాత్రి  బెంగళూరు  లోని చిన్నస్వామి  ప్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన  మ్యాచ్ లో   ఆర్సీబీ బ్యాటర్లు విఫలమైనా  కోహ్లీ సెంచరీతో ఆదుకుని ఆ జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా హాజరైంది.  ఈ సీజన్ లో  బెంగళూరులో జరిగిన దాదాపు అన్ని మ్యాచ్ లకు ఆమె హాజరైంది. 

ఇక నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ తర్వాత  అతడు పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేకపోయినా   ఆర్సీబీ ఆటగాళ్లు, అనుష్క శర్మ, ఫ్యాన్స్ మాత్రం సంబురాల్లో తేలిపోయారు.   విరాట్ శతకం తర్వాత  ఆర్సీబీ డగౌట్ మొత్తం అతడికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చింది. 

అనుష్క శర్మ అయితే  ఐపీఎల్ లో రికార్డు సెంచరీ చేసిన  కోహ్లీకి  ఫ్లయింగ్ కిసెస్  ఇస్తూ  తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.   అనుష్క గతంలో కూడా  చిన్నస్వామి స్టేడియంలో  కోహ్లీ అర్థ సెంచరీ తర్వాత అతడికి  ఫ్లయింగ్ కిసెస్ ఇస్తున్న వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 

 

anushka supporting virat will be the best thing for me forever pic.twitter.com/qCrlceNsR0

— Sxn (@platinumm_24)

ముద్దులిచ్చినా ఓటమి తప్పలే.. 

గత 15 సీజన్లుగా ఒకే కల (ఈసాలా కప్ నమ్దే)ను కంటూ ఈసారైనా దానిని నిజం చేస్తారనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  అభిమానుల ఆశలు  లీగ్ దశలోనే ఆవిరయ్యాయి.   స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొట్టినా.. డుప్లెసిస్ పరుగుల సునామీ సృష్టించినా.. మ్యాక్స్‌వెల్ మ్యాగ్జిమమ్ బాదినా దురదృష్టం మరోసారి  వెంటాడి ఆ జట్టును  ప్లేఆఫ్స్ కు ముందే  బోల్తా కొట్టించింది.  రాజస్తాన్ రాయల్స్,  సన్ రైజర్స్ హైదరాబాద్  ను చావుదెబ్బ కొట్టి  ప్లేఆఫ్స్ కు అదృష్టం హ్యాండ్ ఇచ్చే లోపే గుజరాత్ టైటాన్స్  రూపంలో దురదృష్టం  యాక్సిడెంట్ చేసి  వెళ్లిపోయింది.   

గుజరాత్ చేతిలో ఓడిన తర్వాత  కోహ్లీ డగౌట్ లో  బాధగా కూర్చుని  ముఖం కనిపించకుండా  టోపీ అడ్డు పెట్టుకున్న ఫోటో కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నది. ఇది కోహ్లీ అభిమానులను  మరింత వేదనకు గురి చేస్తున్నది.   ఇది చూసిన  కోహ్లీ ఫ్యాన్స్.. ‘అన్నా నువ్వు ఏడ్వొద్దన్నా.. నువ్వు ఒక్కడివి ఎంతని ఆడతావ్.. టీమ్ కూడా ఆడాలిగా. ఈ టీమ్ కు మనసు లేదన్నా..’  అని కన్నీరుమున్నీరవుతున్నారు.  

 

One Tweet from ur side and One RT is Compulsory....! For King Kohli Tears 💔

A TEAM WITH NO HEART 💔 (What is this ?? Go n see my Latest Tweets but now just Follow and Viral this Trend
RCB vs GT pic.twitter.com/eKUw3ZBeMy

— I'm Sanju (@JodPahadi)
click me!