నువ్వు కారు ప్రమాదంలో చావాలి.. నీ సిస్టర్ ఆర్సీబీ బౌలర్లతో..! గిల్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్

Published : May 22, 2023, 12:25 PM IST
నువ్వు కారు ప్రమాదంలో చావాలి.. నీ సిస్టర్ ఆర్సీబీ బౌలర్లతో..! గిల్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్

సారాంశం

Shahneel Gill Trolls: ఆర్సీబీ - జీటీ మధ్య  ఆదివారం  రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా  ముగిసిన మ్యాచ్ లో బెంగళూరు ఓటమిని జీర్ణించుకోని ఆ జట్టు అభిమానులు గిల్, అతడి సోదరిని టార్గెట్ గా చేసుకుని ట్రోల్స్ కు దిగారు. 

అభిమానం హద్దు మీరి మరొకరి మీద ద్వేషంగా మారితే దాని పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి.  సెలబ్రిటీలకు ఇది ఓ శాపంగా మారింది. గతంలో  బాలీవుడ్ నటీనటులు, నటీమణులు, వారి కుటుంబాలతో పాటు క్రికెటర్లలో కూడా చాలా మంది దీనికి బాధితులే. తాజాగా  టీమిండియా యువ ఓపెనర్, ఐపీఎల్  లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న శుభ్‌మన్ గిల్.. అతడి సోదరి  షానిల్ గిల్‌ను టార్గెట్ గా చేసుకుని ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ (?)  వారిపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. గిల్   కార్ యాక్సిడెంట్ లో చావాలని.. అతడి సోదరినైతే  రాయలేని పదజాలంతో  ట్రోల్ చేస్తున్నారు. 

ఆర్సీబీ - జీటీ మధ్య  ఆదివారం  రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా  ముగిసిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  బెంగళూరు..  నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది.  కోహ్లీ.. సెంచరీ చేశాడు.  తర్వాత గుజరాత్ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే అందుకుంది.  గుజరాత్ తరఫున   శుభ్‌మన్ గిల్.. 52 బంతుల్లోనే  5 బౌండరీలు,  8 సిక్సర్ల సాయంతో  104 పరుగులు చేశాడు. 

ప్లేఆఫ్స్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడంతో  బెంగళూరు ఫ్యాన్స్  ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిశాక  గిల్, అతడి సోదరి షానీల్ గిల్ పై  దూషణలకు దిగారు.  ఓ కారు యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఈ కారులో గిల్ ఉంటే బాగుండు’, ‘కారు ప్రమాదంలో గిల్ మృతి’ అని  కామెంట్స్ చేస్తున్నారు. x @ffsvirat అని రాసి ఉన్న ఫ్రొఫైల్ లో ‘నువ్వూ, నీ ట్రాన్స్‌జెండర్ సోదరి తలలు తెగిపడాలి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో.. నీ జీవితంలో  అన్నీ అపశకునాలే. ఆ మేరకు నేను దేవుడిని ప్రార్థిస్తున్నా.  నీ కంట్లోంచి కారే ప్రతి కన్నీటి బొట్టుకు నా శాపమే కారణం..’ అని ఆగ్రహంగా  కామెంట్ చేశాడు. 

 

 

అక్షత్  అనే ప్రొఫెల్ మరో  కోహ్లీ ఫ్యాన్..  ‘ఇదిగో ఇదే శుభ్‌మన్ గిల్ ఇన్ స్టా ఐడీ.. ఇక మీ ఇష్టం..’ అని ఆమె ఐడీని షేర్ చేశాడు. షానీల్  ఇన్‌స్టాలో అయితే   కామెంట్స్ అన్నీ బూతు పురాణాలే.  షానీల్ గిల్ బికీనీ వేసుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఖలిస్తాని’అని దూషిస్తున్నారు.  విష్ణు. అని ఉన్న ఓ ప్రొఫైల్  లో అయితే..  ‘షానీల్ గిల్  ఆర్సీబీ బౌలర్లతో   బెడ్ పంచుకుంది. అందుకే  గిల్  సెంచరీ చేశాడు..’ అని   కామెంట్ చేయడం  దుమారం రేపింది. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?