సెంచరీలు చెయ్యరు.. కానీ ఇవ్వడానికి ముందుంటారు.. ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు

Published : May 01, 2023, 09:23 AM IST
సెంచరీలు చెయ్యరు.. కానీ ఇవ్వడానికి ముందుంటారు.. ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు

సారాంశం

IPL 2023: ఐపీఎల్ లో ముంబై మరో చెత్త రికార్డు నమోదుచేసింది.  ప్రత్యర్థి టీమ్‌లకు సెంచరీలు సమర్పించుకోవడంలో ఆర్సీబీని అధిగమించింది. 

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్.. నిన్న మరో చెత్త రికార్డును తన పేరిట నమోదుచేసుకుంది.  ఒక్కో జట్టులో బ్యాటర్లు సెంచరీల మీద సెంచరీలు బాదుతుంటే ముంబై బ్యాటర్లు మాత్రం ఐపీఎల్  ప్రారంభం నుంచి ఇప్పటివరకూ చేసిన  సెంచరీలు నాలుగు మాత్రమే. కానీ ప్రత్యర్థులకు సమర్పించుకున్న శతకాల సంఖ్య రెండంకెలకు చేరింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో ముంబైపై ప్రత్యర్థులు చేసిన సెంచరీల సంఖ్య 10కి చేరింది.  

ఆదివారం వాంఖెడే వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో ముగిసిన మ్యాచ్ లో  యశస్వి సెంచరీ చేయడం ద్వారా ముంబై.. ప్రత్యర్థులకు అత్యధిక సెంచరీలు సమర్పించుకున్న టీమ్ లలో రెండో స్థానానికి ఎగబాకింది.  ఇంతకుముందు ఈ రికార్డు  ఆర్సీబీ పేరిట ఉండేది. 

ఆర్సీబీపై వివిధ జట్లు  9 సెంచరీలు చేశాయి.  తాజాగా ఈ రికార్డును ముంబై చెరిపేసింది.  కాగా ఈ జాబితాలో ఫస్ట్ ఉన్న టీమ్ మాత్రం  కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్  పై కూడా అపోజిషన్ టీమ్స్ సెంచరీల పండుగ చేసుకుంటాయి. కేకేఆర్ పై  ఇతర టీమ్స్ 11 సెంచరీలు చేశాయి.  రెండో స్థానంలో ముంబై (10) చేరింది. 

 

ముంబైపై సెంచరీలు చేసిన శతక వీరులు : 

- యూసుఫ్ పఠాన్ - రాజస్తాన్ - 2010లో 100 
- ఏబీ డివిలియర్స్ - ఆర్సీబీ - 2015 లో 133 
- హషీమ్ ఆమ్లా - పంజాబ్ - 2017లో  104
- కెఎల్ రాహుల్ - పంజాబ్ - 2019లో 100 
- బెన్ స్టోక్స్ - రాజస్తాన్ - 2020లో 107  నాటౌట్ 
- కెఎల్ రాహుల్ - లక్నో - 2022లో  103 నాటౌట్ 
- కెఎల్ రాహుల్ - లక్నో - 2022లో  103 నాటౌట్ 
- జోస్ బట్లర్ - రాజస్తాన్ - 2022లో 103 
- వెంకటేశ్ అయ్యర్ - కోల్కతా - 2023 లో 104 
- యశస్వి  జైస్వాల్ - రాజస్తాన్ - 2023లో 124 

ముంబై సెంచరీలు : 

- సనత్ జయసూర్య - 2008లో చెన్నైపై - 114 నాటౌట్
- సచిన్ టెండూల్కర్ - 2011లో కొచ్చిపై -  100 నాటౌట్ 
- రోహిత్ శర్మ - 2012లో  కేకేఆర్‌పై - 109 నాటౌట్ 
- లెండి సిమన్స్ - 2014లో పంజాబ్ పై - 100 నాటౌట్  

PREV
click me!

Recommended Stories

Rohit Sharma : హిట్ మ్యాన్ కెరీర్ లో అత్యంత కఠిన సమయం ఇదే.. అసలు విషయం చెప్పిన రోహిత్!
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?