IPL 2023 RR vs MI: యశస్వి జైస్వాల్ సెన్సేషనల్ సెంచరీ... ముంబై ఇండియన్స్ ముందు...

Published : Apr 30, 2023, 09:20 PM ISTUpdated : Apr 30, 2023, 09:35 PM IST
IPL 2023 RR vs MI: యశస్వి జైస్వాల్ సెన్సేషనల్ సెంచరీ... ముంబై ఇండియన్స్ ముందు...

సారాంశం

Yashasvi Jaiswal ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడో సెంచరీ... 53 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న యశస్వి జైస్వాల్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడో సెంచరీ నమోదైంది. సెన్సేషనల్ పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్న యశస్వి జైస్వాల్, ముంబై ఇండియన్స్‌పై సెన్సేషనల్ సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్ సెంచరీ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్, 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై రాయల్స్‌కి ఇదే అత్యధిక స్కోరు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌కి జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ కలిసి శుభారంభం అందించారు. కామెరూన్ గ్రీన్ వేసిన మొదటి ఓవర్‌లో సిక్సర్‌తో ఖాతా తెరిచిన యశస్వి జైస్వాల్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు.

ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో జోస్ బట్లర్ అవుటైనట్టు అంపైర్ ప్రకటించినా రివ్యూ తీసుకోవడంతో రాజస్థాన్‌ రాయల్స్‌కి ఫలితం దక్కింది. టీవీ రిప్లైలో ఆ బంతి వైడ్‌గా వెళ్తున్నట్టు కనిపించింది. రిలే మెడరిత్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదిన యశస్వి జైస్వాల్, 16 పరుగులు రాబట్టాడు.

పియూష్ చావ్లా వేసిన ఓవర్‌లో ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు యశస్వి జైస్వాల్. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన జోస్ బట్లర్, మరోసారి నిరాశపరిచాడు..

పియూష్ చావ్లా బౌలింగ్‌లో రమణ్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జోస్ బట్లర్. వస్తూనే సిక్సర్ బాదిన సంజూ శాంసన్, ఆ తర్వాతి బంతికి అవుట్‌గా ప్రకటించబడ్డాడు. అయితే టీవీ రిప్లైలో బంతి బ్యాటుకి తగలడం లేదని క్లియర్‌గా కనిపించడంతో శాంసన్‌కి లైఫ్ లభించింది..

అయితే దీన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోయిన సంజూ శాంసన్, 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్‌ని పియూష్ చావ్లా క్లీన్ బౌల్డ్ చేశాడు. 

9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన జాసన్ హోల్డర్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

3 బంతుల్లో 2 పరుగులు చేసిన ధృవ్ జురెల్, రిలే మెడరిత్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో జైస్వాల్ మాత్రం బౌండరీలతోనే ఢీల్ చేశాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వి జైస్వాల్.. 

సెంచరీ పూర్తయిన తర్వాత జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన యశస్వి జైస్వాల్, అర్షద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుస బౌండరీలు బాదాడు. 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో ఫోర్ బాది రవిచంద్రన్ అశ్విన్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

PREV
click me!

Recommended Stories

Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే